ఏపీ అభివృద్ధికి భోగాపురం కీలక మైలురాయి – ప్రధాని

ఏపీ అభివృద్ధికి భోగాపురం కీలక మైలురాయి - ప్రధాని

Summarize with AI

భోగాపురం (Bhogapuram) అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (Alluri Sitarama Raju International Airport) ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై (Andhra Pradesh Development) కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.18 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశామని, ఇవి రాష్ట్రంలో రోడ్డు, విమాన అనుసంధానాన్ని బలోపేతం చేసి అభివృద్ధికి ఊతమిస్తాయని అన్నారు.

భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం గర్వకారణమని పేర్కొన్న ప్రధాని, గిరిజన మహిళలు (Tribal Women) 13 వేల మంది కలిసి చేసిన థింసా నృత్యం (Dhimsa Dance) ప్రపంచ రికార్డు సాధించడం అభినందనీయమన్నారు.

2014లో దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 166కు చేరిందని, ఉడాన్ పథకం (UDAN Scheme) ద్వారా చిన్న పట్టణాల ప్రజలకు కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని, చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేతృత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతున్నాయని అన్నారు. పోర్టులు, రైల్వేలు, హైవేలు, సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్ దేశ అభివృద్ధికి కీలక గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని ప్రధాని మోదీ చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment