హైదరాబాద్‌లోని (Hyderabad) ఇందిరా పార్క్ (Indira Park) వద్ద బీఆర్‌ఎస్‌వీ(BRSV) ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ (NEET Paper Leakage) వ్యవహారంపై ఢిల్లీలో(Delhi) యువత(Youth) గత 25 రోజులుగా పార్టీలకు అతీతంగా న్యాయం కోసం పోరాడుతోందన్నారు. మీడియా సహకారం లేకపోయినా విద్యార్థులు(Students) ఉద్యమాన్ని (Movement) కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు న్యాయం కోరితే వారిపై పోలీసులు దాడులు చేయడం అమానుషమని, ప్రజాస్వామ్య దేశంలో (Democratic Country) ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఉద్యమాల పట్ల బీఆర్‌ఎస్‌కు (BRS)ఎప్పుడూ గౌరవం ఉంటుందని, విద్యార్థుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వంపై (Government) కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. యువత మంత్రి పదవులు అడగడం లేదని, కేవలం న్యాయం, పారదర్శకత, ఉద్యోగాల కోసం మాత్రమే పోరాడుతోందని అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తూ, “మేక్ ఇన్ ఇండియా” (Make in India)పేరుతో ఆశలు చూపించి, చివరకు “లీక్ ఇన్ ఇండియా”గా (Leak in India) మార్చారని విమర్శించారు. తనపై పేపర్ లీక్ ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) కూడా కేటీఆర్ మండిపడుతూ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం తమకుందని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.







