ఇటీవల విజయవాడలో(Vijayawada) చోటుచేసుకున్న సాయికృష్ణ లాకప్ డెత్ (Saikrishna Lockup Death), క్రాంతికుమార్ (Kranti Kumar) కస్టోడియల్ టార్చర్ (Custodial Torture) ఆరోపణల నేపథ్యంలో పోలీసుల వ్యవహారశైలిపై ఇప్పటికే చర్చ జరుగుతున్న వేళ, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో నిందితుడు మిస్సింగ్ ఘటన (Accused Missing Incident) కలకలం రేపింది. ఓ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఆచూకీ లభించడం లేదన్న నిన్న సాయంత్రం నుంచి హల్‌చల్ చేసింది. నిందితుడి ఆచూకీ దొరక్క కుటుంబ సభ్యులు హైకోర్టును (High Court) ఆశ్రయించడం సంచలనంగా మారింది.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మొగిలిచర్లకు చెందిన ఏసుబాబును (Yesu Babu) గత నెల 17వ తేదీన ఓ కేసు విచారణ నిమిత్తం జగ్గయ్యపేట పోలీసులు(Police) తీసుకెళ్లారు. అయితే అప్పటి నుంచి ఆయన ఎక్కడ ఉన్నారనే విషయంపై కుటుంబ సభ్యులకు స్పష్టమైన సమాచారం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఏసుబాబు (Yesu Babu) కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన మేనమామ పల్లెపోగు శివయ్య హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ (Habeas Corpus Petition) దాఖలు చేశారు. విచారణ పేరుతో ఏసుబాబు భార్య, అత్తగారిని కూడా పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వేధింపులకు గురిచేస్తున్నారని వారు పేర్కొంటున్నారు.
ఫ్యాక్ట్‌చెక్ వివరణ
అయితే, ఈ వివాదంపై ఏపీ ఫ్యాక్ట్‌చెక్ వివరణ ఇచ్చింది. మొగిలిచర్ల ఏసుబాబు అనే వ్యక్తిని 3 రోజుల కిందట జగ్గయ్యపేట పోలీసులు అరెస్టు చేశారని తెలిపింది. చట్ట ప్రకారం నిందితుడు అరెస్టు అయిన 24 గంటలలో జగ్గయ్యపేట పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారని, న్యాయమూర్తి తీర్పు ప్రకారం నిందితుడు జగ్గయ్యపేట సబ్ జైలులో (Jaggayyapeta Sub Jail) రిమాండ్ ఖైదీగా ఉన్నాడని తెలిపింది.









రేవంత్, ఉత్తమ్‌కి ఉరి వేసినా తప్పులేదు – హరీశ్‌రావు