ఢిల్లీ క్యాపిటల్స్‌లో భారీ ట్విస్ట్.. పంత్ రీఎంట్రీకి రంగం సిద్ధం!

ఢిల్లీ క్యాపిటల్స్‌లో భారీ ట్విస్ట్.. పంత్ రీఎంట్రీకి రంగం సిద్ధం!

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో భారీ మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరనున్నట్లు క్రికెట్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ట్రేడ్‌లో భాగంగా భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టులోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మాజీ భారత ఫాస్ట్ బౌలర్ దొడ్డ గణేశ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేకెత్తించాయి. పంత్ తిరిగి డీసీలో చేరితే కేఎల్ రాహుల్ ఫ్రాంచైజీని వీడి వేలంలోకి వెళ్లాలని ఆయన అభిప్రాయపడటం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కూడా జట్టులో కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కోచింగ్ బృందంలో చేరనున్నట్లు వార్తలు వస్తుండగా, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా క్రికెట్ వ్యవహారాల అధిపతిగా తిరిగి బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత రెండు సీజన్లుగా ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయిన డీసీ యాజమాన్యం జట్టును పూర్తిగా పునర్వ్యవస్థీకరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పంత్ రీఎంట్రీ, యువరాజ్ చేరిక, గంగూలీ పునరాగమనం వంటి పరిణామాలు ఐపీఎల్ 2027కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ను మరోసారి వార్తల్లో నిలిపాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment