ఏపీలో(Andhra Pradesh) రాజకీయ, పోలీస్ సర్కిల్స్‌ను వణికిస్తున్న విజయవాడ కృష్ణా లంక (Krishna Lanka) ‘గాదె సాయికృష్ణ'(Gade Sai Krishna) కేసు రోజుకో సంచలన మలుపు తిరుగుతోంది. పోలీస్ కస్టడీలోనే సాయికృష్ణను కొట్టి చంపేసి, సాక్ష్యాలు లేకుండా శవాన్ని బైక్‌పై తీసుకెళ్లి దహనం చేసేశారంటూ వస్తున్న ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. సాయికృష్ణపై (Sai Krishna) బురదజల్లేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ బాధితుడి తల్లి విజయలక్ష్మి(Vijayalakshmi), మేనమామ, లీగల్ అడ్వకేట్ మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ కొడుకుపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ.. అధికార పక్షానికి, పోలీసులకు సవాల్ విసిరారు. సాయికృష్ణను ఒక ఇంటర్నేషనల్ మాఫియా డాన్ (International Mafia Don) లాగా, అతనిపై 40, 50 కేసులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో, కొన్ని లీకుల ద్వారా తప్పుడు కథలు అల్లుతున్నారని కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు.
పోలీసులు సాయికృష్ణ(Sai Krishna) ఫోన్ నుంచే అతని స్నేహితులకు, తెలిసిన వాళ్లందరికీ కాల్స్ చేయించారని తెలిపారు. ఆ ఫోన్ కాల్స్ చూసి స్టేషన్‌కు వచ్చిన వాళ్లందరినీ పోలీసులు లోపల వేసి విచక్షణారహితంగా కొట్టారని ఆరోపించారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లందరినీ బెదిరించి పంపించేసి.. సాయికృష్ణను మాత్రం విడిగా బాత్రూమ్‌లో కూర్చోబెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఆ దెబ్బలకే ప్రాణాలు విడిచి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.
సాయికృష్ణ తరఫున పోరాడుతున్న అడ్వకేట్ ఈ సందర్భంగా ప్రభుత్వానికి, పోలీసులకు బహిరంగ సవాల్ విసిరారు. సాయికృష్ణపై 40, 50 కేసులు ఉన్నాయనడం పచ్చి అబద్ధమని.. 40 కేసులు ఉన్నాయని నిరూపించడానికి మీ దగ్గర ఆధారాలుంటే విజయవాడ (Vijayawada) బందర్ రోడ్డుకు వచ్చి ఆ ఆధారాలను ప్రజల ముందు పెట్టండి. తప్పు చేస్తే కోర్టులు శిక్షించాలి గానీ.. స్టేషన్‌లో కొట్టి చంపేసి, శవాన్ని కాల్చేసే హక్కు సీఐ నాగరాజుకు ఎవరు ఇచ్చారు? చంపేసి కూడా అబద్ధాలు చెప్తారా?” అంటూ సవాల్ విసిరారు.
గాదె సాయికృష్ణ వ్యవహారంపై హైకోర్టు ఇప్పటికే సీరియస్ అయ్యి, జూన్ 29 లోగా సాయికృష్ణను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. మరి ఈ ‘లాకప్ డెత్’ మిస్టరీపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.








