మహిళల టీ20 ప్రపంచకప్ 2026 (Women’s T20 World Cup 2026) సమరానికి రంగం సిద్ధమైంది. జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో (Birmingham) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో (Pakistan) జరిగే హైవోల్టేజ్ మ్యాచ్‌తో హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సేన తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీ20 ప్రపంచకప్‌ను గెలవని భారత్, ఈసారి ఎలాగైనా చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉంది.
షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ వంటి స్టార్ ఆటగాళ్లతో పాటు యువ స్పిన్నర్ శ్రీ చరణిపై కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే టోర్నీకి ముందు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లతో జరిగిన సిరీస్‌లలో ఎదురైన పరాజయాలు అభిమానుల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి.
గ్రూప్-ఏలో ఉన్న భారత్‌కు ఈసారి సెమీఫైనల్ దారి అంత సులువు కాదు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో పాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను ఎదుర్కోవాల్సి ఉంది. ముఖ్యంగా జూన్ 21న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ టీమిండియా భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశముంది.
మరోవైపు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) 4500 టీ20 అంతర్జాతీయ పరుగుల మైలురాయికి చేరువలో ఉండగా, అరుంధతి రెడ్డి 50 వికెట్ల ఘనతకు కేవలం రెండు వికెట్ల దూరంలో ఉంది. 2020లో రన్నరప్‌గా నిలిచిన భారత్(India), ఈసారి ఆ నిరాశను చెరిపేసి తొలి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలని లక్ష్యంగా పెట్టుకుంది.








