నెహ్రూ రికార్డ్‌ను బ్రేక్ చేయ‌బోతున్న మోడీ

నెహ్రూ రికార్డ్‌ను బ్రేక్ చేయ‌బోతున్న మోడీ

భారత రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితం కాబోతోంది. దేశంలో అత్యధిక కాలం వరుసగా పరిపాలించిన ‘ఎన్నికైన ప్రధానమంత్రి’(Prime Minister)గా నరేంద్ర మోదీ (Narendra Modi) సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. రేపటితో (బుధవారం, జూన్ 10) ఆయన ప్రధాని పీఠంపై (Prime Minister Post) వరుసగా 4,399 రోజులు పూర్తి చేసుకోనున్నారు. తద్వారా దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) పేరిట ఉన్న రికార్డును (Record) మోదీ తిరగరాయనున్నారు.

ఈ అరుదైన చారిత్రక మైలురాయిని చేరుకుంటున్న తరుణంలోనే.. రేపు ఢిల్లీలో (Delhi) ఎన్డీయే (NDA) కూటమి పక్ష నేతల కీలక సమావేశం జరగనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగి, మొదటి లోక్‌సభ ఏర్పాటయ్యాక.. నెహ్రూ 1952 మే 13 నుండి ఆయన మరణించే వరకు (1964 మే 27) ఎన్నికైన ప్రధానిగా వరుసగా 4,398 రోజులు బాధ్యతల్లో కొనసాగారు. (అంతకుముందు 1947 నుంచి 1952 వరకు ఆయన తాత్కాలిక/ఇంటర్న్ ప్రధానిగా ఉన్నారు).

అయితే, 2014 మే 26న తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ(Narendra Modi), నాటి నుంచి నేటి వరకు (వరుసగా మూడోసారి) నిరంతరాయంగా పదవిలో కొనసాగుతూ రేపటికి 4,399 రోజులు పూర్తి చేసుకోనున్నారు. ఈ జాబితాలో ఇందిరాగాంధీ (Indira Gandhi) (4,077 రోజులు) మూడో స్థానంలో ఉన్నారు.

ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని రేపు ఢిల్లీలో(Delhi) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతల ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం ఎన్డీయే కూటమిలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ప్రాంతీయ పార్టీల అధినేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ స‌మావేశంలో భవిష్యత్ కార్యాచరణ, దేశ సంస్కరణలపై చర్చించనున్నట్లు స‌మాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment