రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. నిరుద్యోగులకు గొప్ప అవకాశం

రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. నిరుద్యోగులకు గొప్ప అవకాశం

Summarize with AI

దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు శుభవార్త అందించింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB). మొత్తం 32,438 గ్రూప్-D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 23, 2025 నుండి ప్రారంభమై ఫిబ్ర‌వరి 22, 2025 చివరి తేదీతో ముగుస్తుంది.

ఏయే పోస్టులు అందుబాటులో ఉన్నాయి?
ఈ నోటిఫికేషన్ ద్వారా పాయింట్స్‌మన్, ట్రాక్ మెయింటెనర్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ వంటి విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాలు కూడా ఉన్నాయి. పదో తరగతి లేదా సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత అవసరం. 18-36 సంవత్సరాలు (2025 జులై 1 నాటికి), ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.250 మాత్రమే ఉంటుంది.

ఎంపిక విధానం
అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000 వరకు జీతం చెల్లించనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment