కదం తొక్కిన ‘కాక్రోచ్’.. ద‌ద్ద‌రిల్లిన ఢిల్లీ వీధులు

'కాక్రోచ్ జనతా పార్టీ' ధర్నా.. ద‌ద్ద‌రిల్లిన ఢిల్లీ వీధులు

దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద శనివారం రాజకీయంగా పెను కలకలం రేగింది. విద్యాశాఖలో జరుగుతున్న వరుస అవకతవకలు, పేపర్ లీకేజీలపై (Paper Leakages) కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తక్షణమే తన పదవికి రాజీనామా (Resignation) చేయాలంటూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janata Party) దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నిరసనలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(Abhijeet Deepke) స్వ‌యంగా పాల్గొన‌డం హాట్ టాపిక్‌గా మారింది.

దేశంలో విద్యా వ్యవస్థ (Education System) తీరుతెన్నులు, నిరుద్యోగ సమస్యలు(Unemployment Issues),, ఇటీవల కాలంలో పరీక్షల నిర్వహణలో వెలుగుచూసిన లోపాలపై యువతలో ఉన్న తీవ్ర అసంతృప్తి ఈ నిరసనతో ఒక్కసారిగా బద్దలైంది. కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు, యువత ఢిల్లీకి తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి, విద్యాశాఖకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ జంతర్ మంతర్ పరిసరాలను హోరెత్తించారు.

ఈ ఆందోళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ అధినేత అభిజీత్ దీప్కే.. నిరసనలకు నాయకత్వం వహించేందుకు అమెరికా నుండి నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ధర్నా ఉద్దేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల జీవితాలతో కేంద్ర విద్యాశాఖ ఆడుకుంటోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకునే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.

ముందస్తు సమాచారం ఉండటంతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు జంతర్ మంతర్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకారుల డిమాండ్లు, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ ధర్నాకు అధికారికంగా అనుమతి ఇచ్చారు. రాజధాని నడిబొడ్డున కొత్త పార్టీ ఆధ్వర్యంలో, యువత కేంద్రంగా జరిగిన ఈ ఆందోళన ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment