జగిత్యాల జిల్లాకు (jagityala District) చెందిన మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి (Tippiri Tirupati) అలియాస్ దేవ్‌జీ (Devji) జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు విప్లవ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన, ఇప్పుడు విద్య ద్వారా సమాజ సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
ఇటీవల విడుదలైన లాసెట్ (LAWCET) ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 349వ ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. 50 ఏళ్లు దాటిన వయసులోనూ చదువుపై ఆసక్తి కోల్పోకుండా కృషి చేసి ఈ ఘనత సాధించడం విశేషంగా నిలిచింది. ఇదే క్రమంలో గత నెల కోరుట్లలో నిర్వహించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను (Advanced Supplementary Examinations) కూడా ఆయన రాశారు.
విప్లవ మార్గం నుంచి ప్రజాసేవ దిశగా అడుగులు వేస్తున్న దేవ్‌జీ(Devji), న్యాయ విద్యను అభ్యసించి లాయర్‌గా మారాలని సంకల్పించారు. పేదలు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయసహాయం అందించడం తన జీవిత లక్ష్యమని ఆయన తెలిపారు. అడవుల్లో పోరాటం చేసిన వ్యక్తి ఇప్పుడు కోర్టుల ద్వారా న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకోవడం పలువురిని ఆకట్టుకుంటోంది. పట్టుదల, కృషి ఉంటే వయసు అడ్డంకి కాదని దేవ్‌జీ నిరూపించిన ఈ విజయం యువతతో పాటు జీవితంలో కొత్తగా ప్రారంభించాలనుకునే వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది.









బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర