శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆగస్టు నెల దర్శన కోటా విడుదల

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆగస్టు నెల దర్శన కోటా విడుదల

Summarize with AI

ఆగస్టు నెలలో తిరుమల (Tirumala) శ్రీవారిని (Srivari) దర్శించుకోవాలనుకునే (Darshan) భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)(TTD) కీలక ప్రకటన చేసింది. ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదులకు సంబంధించిన ఆన్‌లైన్ కోటా విడుదల తేదీలను ఖరారు చేసింది. భక్తుల సౌకర్యార్థం టీటీడీ విడుదల చేసిన పూర్తి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి

సేవా టికెట్ల విడుదల తేదీలు
మే 18 (ఉదయం 10 గంటలకు) ఆర్జిత సేవా టికెట్ల (Arjita Seva Tickets) లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం. ఇందులో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన (Ashtadala Padapadmaradhana) వంటి సేవలు ఉంటాయి.
మే 21 (ఉదయం 10 గంటలకు): కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి ఆర్జిత సేవా టికెట్లు విడుదల.
మే 21 (మధ్యాహ్నం 3 గంటలకు): వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటా విడుదల.

దర్శన టోకెన్ల వివరాలు
మే 23 (ఉదయం 10 గంటలకు) అంగప్రదక్షిణ టోకెన్ల విడుదల.
మే 23 (ఉదయం 11 గంటలకు) శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల కోటా విడుదల.
మే 23 (మధ్యాహ్నం 3 గంటలకు) వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి సంబంధించిన ప్రత్యేక దర్శన కోటా.
మే 25 (ఉదయం 10 గంటలకు) రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల.

వసతి గదుల కోటా
మే 25 (మధ్యాహ్నం 3 గంటలకు) తిరుమల, తిరుపతిలో గదుల రిజర్వేషన్ కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment