తోకముడిచిన ‘జావా డిస్కవర్’! డాక్యుమెంటరీ తొలగింపు

తోకముడిచిన ‘జావా డిస్కవర్’! డాక్యుమెంటరీ తొలగింపు

రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఏపీ (Andhra Pradesh) మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై (YS Jagan Mohan Reddy) జరుగుతున్న విషప్రచారానికి బ్రేక్ పడింది. ఎర్రచందనం (Red Sanders) స్మగ్లింగ్‌పై (Smuggling)అవాస్తవాలతో కూడిన డాక్యుమెంటరీని ప్రసారం చేసిన అంతర్జాతీయ ఛానల్ ‘జావా డిస్కవర్’ (Java Discover), తన తప్పు తెలుసుకుని ఆ వీడియోను వెనక్కి తీసుకుంది. తప్పుడు కథనాన్ని అడ్డుపెట్టుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన టీడీపీ శ్రేణులకు ఇది గట్టి ఎదురుదెబ్బగా మారింది.

అసలేం జరిగింది?
సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి (Udumula Sudhakar Reddy) రచించిన ప్రసిద్ధ పుస్తకం ‘బ్లడ్ శాండల్స్’ (Blood Sandals) ఆధారంగా ‘జావా డిస్కవర్’ ఛానల్ ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. అయితే, ఈ వీడియోలో వాస్తవాల‌ను వ‌క్రీక‌రిస్తూ, ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ ఫోటోను ప్రదర్శిస్తూ, స్మగ్లింగ్‌తో ఆయనకు సంబంధం ఉన్నట్లుగా చిత్రీకరించింది. వాస్తవానికి సుధాకర్ రెడ్డి తన పుస్తకంలో జగన్ పేరును గానీ, ఫోటోను గానీ ఎక్కడా ప్రస్తావించలేదు.

ర‌చ‌యిత ఆగ్రహం.. లీగల్ నోటీసులు!
తమ కథనానికి మూలాధారమైన రచయిత సుధాకర్ రెడ్డి పేరును వాడుకుంటూ, ఆయన రాయని అంశాలను డాక్యుమెంటరీలో చేర్చడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా, అబద్ధాలను ప్రచారం చేసినందుకు సదరు ఛానల్‌పై లీగల్ యాక్షన్‌కు దిగారు. రచయిత అనుమతి లేకుండా అంశాలను వక్రీకరించడంపై నిలదీశారు.

వైసీపీ హెచ్చరిక.. టీడీపీ అభాసుపాలు!
ఈ తప్పుడు వీడియో బయటకు రాగానే, తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తూ జగన్‌పై విషప్రచారం మొదలుపెట్టాయి. అయితే, వెంటనే స్పందించిన వైసీపీ లీగల్ సెల్, ఆ ఛానల్‌కు నోటీసులు పంపింది. ఒక అంతర్జాతీయ స్థాయి సంస్థ ఇలాంటి అవాస్తవాలను ఎలా ప్రసారం చేస్తుందని ప్రశ్నించింది. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించడంతో, జావా డిస్కవర్ ఛానల్ ఆ వీడియోను తన ఛానల్ నుండి పూర్తిగా తొలగించింది.

తప్పుడు ప్రచారాలకు కాలం చెల్లింది..
కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక జాతీయ నాయకుడిపై అంతర్జాతీయ వేదికలపై తప్పుడు కథనాలు వండించే ప్రయత్నం బెడిసికొట్టిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తప్పుడు కథనాన్ని అడ్డుపెట్టుకుని సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు, ఇప్పుడు ఆ వీడియో డిలీట్ కావడంతో నోరు మెదపలేక పోతున్నారని విమర్శిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment