తెలంగాణ రక్షణ సేన కాదు.. ‘రాక్షస సేన’ – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తెలంగాణ రక్షణ సేన కాదు.. 'రాక్షస సేన' - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Summarize with AI

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కొత్తగా స్థాపించిన ‘తెలంగాణ రక్షణ సేన’పై(Telangana Rakshana Sena) జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Anirudh Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కవిత స్థాపించిన పార్టీ పేరును ఎద్దేవా చేస్తూ, అది ప్రజలను రక్షించే పార్టీ కాదని, తెలంగాణను పీడించే “తెలంగాణ రాక్షస సేన” అని అభివర్ణించారు. కేవలం రాష్ట్రాన్ని మరోసారి దోచుకోవడానికే ఆమె ఈ కొత్త వేదికను సిద్ధం చేసుకున్నారని మండిపడ్డారు.

తండ్రి అధికారంలో ఉన్నప్పుడు మౌనం ఎందుకు? అని క‌విత‌ను ప్ర‌శ్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. “మీ తండ్రి కెసిఆర్(KCR) పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి(Corruption), దోపిడీ (Exploitation) గురించి కవిత ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు రక్షణ సేన గుర్తుకు రాలేదా?” అని నిల‌దీశారు. తండ్రి అధికారం పోవడంతో తన పప్పులు ఉడకడం లేదని, మళ్లీ దోపిడీ పర్వం కొనసాగించేందుకే ఈ పార్టీని ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు.

సొంత తండ్రిపైనే పోరాటమా?
తన రాజకీయ ఉనికి కోసం సొంత తండ్రిపైనే పోరాటం చేస్తానంటున్న కవిత, రేపు ప్రజలకు ఏ రకమైన భరోసా ఇస్తారని ఆయన నిలదీశారు. తండ్రినే నమ్మని వ్యక్తి ప్రజలను ఎలా కాపాడుతుందని విమర్శించారు. టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇప్పుడు కవిత పెట్టిన పార్టీ అయినా.. ఇవన్నీ తెలంగాణ ప్రజల ఆస్తులను దోచుకోవడానికి పుట్టినవేనని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. “తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. పదేళ్ల దోపిడీని కళ్లారా చూశారు. ఇప్పుడు కొత్త వేషాలతో వచ్చినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. తండ్రి చాటు బిడ్డగా అవినీతికి పాల్పడిన చరిత్రను ప్రజలు మర్చిపోరు.” అని అనిరుధ్ రెడ్డి అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment