భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి కారణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.
వారం రోజుల సంతాప దినాలు
మన్మోహన్ సింగ్ సేవలను గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలుగా పాటించాలని నిర్ణయించింది. దేశ ఆర్థిక రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ఆయన, ఆర్థికమంత్రిగా, ప్రధానమంత్రిగా చేసిన సేవలు అనన్య సామాన్యం ప్రభుత్వం కొనియాడింది.
ఏపీలోనూ సెలవు ఇవ్వాలని..
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో ప్రేరేపితమైన నెటిజన్లు, ఆంధ్రప్రదేశ్లో కూడా సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మన్మోహన్ సింగ్ సేవలను స్మరించుకునే విధంగా ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.








