ఇదెక్క‌డి చోద్యం.. ఆశీర్వ‌చ‌నానికి అనుమ‌తా..?

ఇదెక్క‌డి చోద్యం.. ఆశీర్వ‌చ‌నానికి TTD అనుమ‌తా..?

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రాజకీయ కక్షసాధింపులు పరాకాష్టకు చేరాయనే విమర్శలకు బలం చేకూర్చేలా తాజా సంఘటన చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని (YS Jagan Mohan Reddy) కలిసి ఆశీర్వచనం అందజేసిన అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై, కార్యకర్తలపై దాడులు, కేసులు సర్వసాధారణం అయిపోయాయి. అయితే ఇప్పుడు ఆ వేధింపులు దేవుడి సేవలో ఉండే అర్చకుల వరకు పాకడం విస్మయానికి గురిచేస్తోంది. కేవలం మాజీ ముఖ్యమంత్రిని ఆశీర్వదించినందుకే అర్చకులకు నోటీసులు ఇవ్వడం ‘రాజకీయ కక్షసాధింపు’కు నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఏం జరిగింది?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల తన నియోజకవర్గం పులివెందుల (Pulivendula) పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో టీటీడీ అనుబంధ దేవాలయమైన ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు ఆయనను కలిసి, వేద మంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. దీనిపై సీరియస్ అయిన టీటీడీ ఉన్నతాధికారులు.. “ముందస్తు టీటీడీ అనుమతి లేకుండా మాజీ సీఎంను కలవడం నేరం” అంటూ సదరు అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

భక్తిపై రాజకీయ పెత్తనమా?
ఈ చర్యపై రాజకీయ విశ్లేషకులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ బోర్డు బాధ్యతలు చేపట్టాక, చైర్మన్ ఆదేశాల మేరకే అధికారులు ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆలయాల్లో జరుగుతున్న అపచారాలు, దొంగతనాలు, భక్తుల సౌకర్యాల లేమి, తొక్కిసలాటలు వంటి తీవ్రమైన అంశాలపై దృష్టి సారించని అధికారులు.. కేవలం ఒక నేతను ఆశీర్వదించినందుకు నోటీసులు ఇవ్వడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

జగన్‌ను(Jagan) ఎవరు కలిసినా, ఆఖరికి ఆశీర్వచనం ఇచ్చే అర్చకులపై కూడా చర్యలు తీసుకోవడం కూటమి ప్రభుత్వ అభద్రతాభావానికి నిదర్శనమని వైసీపీ మండిపడుతోంది. “దేవుడి సేవలో ఉండే అర్చకులకు ఎవరిని ఆశీర్వదించాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందా? ఇది కేవలం జగన్ పట్ల ఉన్న భయంతో చేస్తున్న పిరికిపంద చర్య అని వైసీపీ నేతల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా మాజీ సీఎంలను అర్చకులు కలవడం అనేది దశాబ్దాలుగా వస్తున్న ఆచారం. కానీ ఇప్పుడు దానిని ‘నేరం’గా పరిగణించడం ఏపీ రాజకీయాల్లో కొత్త సంప్రదాయానికి తెరతీసింది. భక్తిని, సంప్రదాయాలను కూడా రాజకీయ రంగుతో చూడటం ఆలయ వ్యవస్థకే మాయ‌ని మ‌చ్చ‌ అని ఆధ్యాత్మిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment