విజయ్‌కి కోర్టు షాక్.. విడాకుల కేసులో కీలక ఆదేశాలు!

విజయ్‌కి కోర్టు షాక్.. విడాకుల కేసులో కీలక ఆదేశాలు!

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్(Vijay) వ్యక్తిగత జీవితం ఇప్పుడు న్యాయస్థానం మెట్లెక్కింది. తన భార్య సంగీత (Sangeetha నుంచి విడాకులు కోరుతూ సాగుతున్న ఈ న్యాయపోరాటంలో చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు (Principal Sessions Court) సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టి బిజీగా ఉన్న విజయ్‌కు ఈ ఆదేశాలు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.

హాజరుకావాల్సిందే..!
విజయ్, సంగీతల విడాకుల పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, తదుపరి విచారణను జూన్ 15వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఈసారి విచారణకు విజయ్, సంగీత ఇద్దరూ ఖచ్చితంగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

విజయ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలు, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో (Assembly Election Campaign) బిజీగా ఉన్నందున, ఆయన నేరుగా రావడం కష్టమని.. కావున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరారు. అయితే, ఈ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. చట్టం ముందు అందరూ సమానమేనని, జూన్ 15న విజయ్ వ్యక్తిగతంగా కోర్టుకు రావాల్సిందేనని ఆదేశించారు.

భరణం విషయంలో భారీ వ్యత్యాసం?
ఈ విడాకుల కేసులో భరణం (Alimony) అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంగీత సుమారు రూ. 250 కోట్ల భారీ భరణాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన ఆస్తుల ఆధారంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయ్ మాత్రం రూ. 35 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, పిల్లల బాధ్యతను తానే చూసుకుంటానని కోర్టుకు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఆర్థిక పరమైన సెటిల్మెంట్ కుదరకపోవడంతోనే విడాకుల ప్రక్రియ ఆలస్యమవుతోందని టాక్ వినిపిస్తోంది.

ఉత్కంఠలో అభిమానులు
ఒకవైపు విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని వేగవంతం చేస్తున్న తరుణంలో, మరోవైపు వ్యక్తిగత జీవితంలోని ఈ వివాదాలు ఆయన ప్రతిష్టపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 15న విజయ్ కోర్టుకు హాజరవుతారా? లేదా మరేదైనా మలుపు తిరుగుతుందా? అనేది వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment