టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni), అందాల భామ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) జంటగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్’ (Lenin). మురళీ కిశోర్ అబ్బూరు (Murali Kishor Abburu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘యెట్ట యెట్ట’ (Yetta Yetta) అంటూ సాగే మొదటి వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ (S.S. Thaman) ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ‘యెట్ట యెట్ట’ సాంగ్‌ను ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ (Bhaskarabhatla Ravikumar) రాశారు. సింగర్ శ్రీకృష్ణ (Sri Krishna) తనదైన శైలిలో ఈ పాటను ఆలపించగా, వినగానే ఆకట్టుకునేలా మెలోడియస్ బీట్స్‌తో తమన్ ఈ సాంగ్‌ను కంపోజ్ చేశారు.
ఈ పాటలో అఖిల్ అక్కినేని తన లుక్స్‌తో ఆకట్టుకోగా, భాగ్యశ్రీ బోర్సే స్క్రీన్ ప్రెజెన్స్ మేజర్ హైలైట్‌గా నిలిచింది. వీరిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ (Chemistry) ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విజువల్స్ పరంగా ఈ సాంగ్ చాలా గ్రాండ్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది.
డిఫరెంట్ కథాంశంతో వస్తున్న ఈ మూవీకి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సాంగ్ విడుదలతో సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.









తెలంగాణను అవమానిస్తే సహించం.. కేటీఆర్, హరీష్ ఫైర్