మ‌హిళ‌ల‌ను తిట్టిన వ్య‌క్తికి మద్దతిస్తారా? – నెటిజ‌న్లు ఫైర్‌

మ‌హిళ‌ల‌ను తిట్టిన వ్య‌క్తికి మద్దతిస్తారా? - నెటిజ‌న్లు ఫైర్‌

టీడీపీ(TDP) అనుకూల మీడియా అధినేత‌ ఏబీఎన్ రాధాకృష్ణ (ABN Radha Krishna) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు రేపాయి. మహిళలను (Women), ముఖ్యంగా వైసీపీ నేతల కుటుంబ సభ్యులను (YSRCP Leaders Family Members) ఉద్దేశించి ఆయన చేసిన నీచమైన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ తప్పుడు వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి.. సీఎం చంద్రబాబు (Nara Chandrababu Naidu), మంత్రి లోకేష్ (Nara Lokesh), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాధాకృష్ణకు మద్దతుగా ట్వీట్లు చేయడం ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

రాధాకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు
ఏబీఎన్ ఛానల్‌లో (ABN channel) ప్రసారమైన ఒక కథనంలో వైసీపీ నేతల భార్యలను, మహిళలను కించపరిచేలా రాధాకృష్ణ వ్యాఖ్యలు చేశారు. “జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) చెబితే మీ భార్యలను చెల్లెళ్లుగా భావించి పెళ్లి సంబంధాలు చూసే బ్యాచ్” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేశాయి. ఒక మీడియా సంస్థ అధిపతి స్థానంలో ఉండి మహిళల పట్ల ఇంత అసభ్యకరంగా మాట్లాడటంపై మహిళా సంఘాలు కూడా మండిపడుతున్నాయి.

ట్వీట్లతో విరుచుకుపడ్డ నెటిజన్లు
హైదరాబాద్‌లోని (Hyderabad) ఏబీఎన్ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు శాంతియుతంగా నిరసన తెలుపుతుండ‌గా, మ‌హిళా గౌర‌వం అనే నినాదాన్ని ఎత్తుకున్న ప్ర‌భుత్వం, ఆ వ్యాఖ్య‌ల‌ను ఖండించ‌క‌పోగా, రాధాకృష్ణ‌కు మద్దతుగా నిలుస్తూ, ట్వీట్లు చేయడం గమనార్హం. ఏబీఎన్ రాధాకృష్ణ‌కు మ‌ద్ద‌తుగా సీఎం చంద్రబాబు చేసిన ట్వీట్‌కు గంటల వ్యవధిలోనే 200కు పైగా నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. “ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక దుర్మార్గుడికి మద్దతిస్తారా? ఇదేనా మీ 40 ఏళ్ల అనుభవం?” అంటూ నెటిజన్లు నిలదీశారు.

లోకేష్, పవన్ ట్వీట్లకూ ఇదే సెగ
వేదిక‌ల‌పై మ‌హిళ‌ల‌ను గౌర‌వించాల‌ని లెక్చ‌ర్ ఇచ్చే మంత్రి లోకేష్, ఆడ‌వారి జోలికి వ‌స్తే తాట‌తీస్తాన‌ని గ‌తంలో మాట్లాడిన‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు సైతం ఆర్కేకు మ‌ద్ద‌తు తెలప‌డంపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. “మహిళలను కించపరిచిన వ్యక్తికి వత్తాసు పలకడం సిగ్గుచేటు” అని ఘాటుగా స్పందిస్తున్నారు.

అనుభవాన్ని తాకట్టు పెట్టారా?
“ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి, మహిళల పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించిన ఛానల్‌కు మద్దతు ఇవ్వడం ఏమాత్రం సరికాదు” అని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తున్న తీరు చూస్తుంటే.. మీ అనుభవాన్ని ఎవరి దగ్గరైనా తాకట్టు పెట్టారా? అని ఓ నెటిజన్లు ప్రశ్నించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరిస్థితి తీవ్రతను గమనించిన కొందరు నెటిజన్లు.. ఇలాంటి కామెంట్లు చూడలేకపోతే వెంటనే ‘కామెంట్స్ సెక్షన్’ డిజేబుల్ చేసుకోవాలంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఒక మీడియా సంస్థ చేసిన వ్యక్తిగత దూషణలకు ప్రభుత్వం మద్దతు తెలపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment