ఆంధ్రజ్యోతి అధినేత (Andhra Jyothi Chairman) వేమూరి రాధాకృష్ణ (Vemuri Radhakrishna) వైసీపీ నేతల (YSRCP Leaders) భార్యలపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అత్యంత తీవ్రంగా స్పందించారు. కేవలం విమర్శలతో ఆగకుండా, రాధాకృష్ణకు ప్రత్యక్షంగా హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మహిళలను కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, భవిష్యత్తులో దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
నీకంత అలుసా కనిపిస్తున్నారా?
“వైసీపీ శ్రేణులు, వారి భార్యలంటే నీకంత అలుసుగా కనిపిస్తున్నారా రాధాకృష్ణా?” అంటూ జగన్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో గతంలో ఎప్పుడో సోషల్ మీడియాలో పాత కామెంట్లను వెతికి పట్టుకుని మరీ కేసులు పెట్టి, కొడుతూ ఇబ్బంది పెడుతున్నారని.. రేపు వైసీపీ అధికారంలోకి వచ్చాక రాధాకృష్ణకు కూడా అదే గతి ఖచ్చితంగా పడుతుందని హెచ్చరించారు. “మా ప్రభుత్వం వచ్చాక నిన్ను తిప్పని పోలీస్ స్టేషన్ ఉండదు, గుర్తు పెట్టుకో” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ శ్రేణులు, వారి భార్యలంటే నీకంత అలుసుగా కనిపిస్తుందా..?
— Telugu Feed (@Telugufeedsite) April 8, 2026
రాధాకృష్ణా.. మా ప్రభుత్వం వచ్చాక నిన్ను తిప్పని స్టేషన్ తిప్పకుంటే అడుగు
– మాజీ సీఎం వైఎస్ జగన్ వార్నింగ్ https://t.co/fLTN98pt2b pic.twitter.com/2Dp5RW3OyE
వివాదానికి కారణం ఏమిటి?
ఏబీఎన్‌లో(ABN) ప్రతివారం నిర్వహించే కొత్తపలుకు కార్యక్రమంలో రాధాకృష్ణ.. వైసీపీ శ్రేణులలను ఉద్దేశించి అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. “రేపు వైఎస్ జగన్ మీ భార్యలు మీ అక్కాచెల్లెళ్లు అని చెబితే, మీరు వారికి సంబంధాలు చూసి పెళ్లి చేస్తారు?” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి. రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు, మహిళా విభాగం రోడ్లపైకి వచ్చారు.
మంగళవారం హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆఫీసు ఎదుట వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు భారీ ధర్నా నిర్వహించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టారు. మహిళలను అవమానించిన రాధాకృష్ణ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కూటమి మౌనంపై విమర్శలు
మహిళలను ఇంత దారుణంగా కించపరిచినా, కూటమి ప్రభుత్వం (టీడీపీ-జనసేన-బీజేపీ) నేతలు కనీసం ఖండించకపోగా, రాధాకృష్ణకు మద్దతు తెలపడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, విలువలు లేని ‘బ్రోకరిజం’ అని నేతలు మండిపడుతున్నారు.







