సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. మతం మారితే ఎస్సీ హోదా రద్దు

సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. మతం మారితే ఎస్సీ హక్కులు లేవు

క్రైస్తవ మతంలోకి (Christian Religion) మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు (SC Rights) కోల్పోతారని సుప్రీంకోర్టు (Supreme Court of India) స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. క్రైస్తవ మతంలోకి (Christianity) మారిన వ్యక్తి షెడ్యూల్డ్ కాస్ట్ (SC) హక్కులను పొందలేడని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేశాడు పిటిషనర్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. మత మార్పిడి తర్వాత కూడా ఎస్సీ హక్కులు కొనసాగవని జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్‌వీ అంజారియా (Justice P.K. Mishra) నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.

ఏపీకి చెందిన బాపట్ల జిల్లా (Bapatla District) పిట్టలవానిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ (Chintada Anand) అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చర్చి నిర్వహించడంపై అక్కల రామిరెడ్డి (Akkala Ramireddy), ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చింతాడ ఆనంద్, SC, ST అట్రాసిటీ నిరోధక చట్టం కింద అక్కల రామిరెడ్డి, ఇతరులపై కేసు నమోదు చేశాడు. ఈ కేసును సవాల్ చేస్తే అక్కల రామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆనంద్ అనే వ్యక్తి పాస్టర్‌గా (Pastor) మారాడని, అతను క్రైస్తవ్యాన్ని స్వీకరించాడని తెలిపారు. మతం మారిన ఆనంద్‌కు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వర్తించవని హైకోర్టు పిటిషన్‌లో పేర్కొన్నారు.

“షెడ్యూలు కులాల రాజ్యాంగ 1950 లోని 3వ నిబంధన ప్రకారం హిందువు కాని వ్యక్తి, హిందువులోని ఏ కులానికి చెందిన వాడు కాలేడు. పుట్టుకతో హిందువు(Hindu) అయినప్పటికీ మతం మారడం వల్ల ఆనంద్ షెడ్యూలు కులానికి చెందిన వాడు కాదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు అతడికి వర్తించవు. హిందూ మతంలోని కుల ప్రస్తావన ప్రపంచవ్యాప్తంగా మహమ్మదీయ & క్రైస్తవ మతాలలో లేదు.. అందుచేత ఆనంద్ ఫిర్యాదు చట్ట వ్యతిరేకం. ఈ కేసు రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుంది.” అని అక్కల రామిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.

మరోవైపు.. ఆనంద్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. “ఆనంద్‌కి ప్రభుత్వం ఇచ్చిన SC-హిందు సర్టిఫికేట్ ఉంది. అందువల్ల అట్రాసిటీ చట్టం ఆనంద్‌కి వర్తిస్తుంది.” అని వాదించారు. ఇరువురి వాదనలు విన్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ (Justice Harinath).. మతం మారిన ఎస్సీ వ్యక్తి హిందువు కాలేడని, అతడికి SC, ST అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదని సంచలన తీర్పునిచ్చారు. అక్కల రామిరెడ్డి, ఇతరులపై క్రిమినల్ కేసును కొట్టివేశారు. దీనిపై ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment