క్షణికావేశంతో ఓ సెక్యూరిటీ గార్డు (Security Guard) దారుణానికి ఒడిగట్టాడు. సెలవు తీసుకున్నందుకు జీతం కట్ (Salary Cut) చేశారని ఆగ్రహంతో ఓ బ్యాంక్ గార్డు తన మేనేజర్‌ను (Bank Manager) కాల్చి చంపాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్ (Ghaziabad) ప్రాంతంలో సంచలనంగా మారింది.
సెలవు వివాదం.. హత్యకు దారి
బలరామ్ నగర్ కాలనీలో ఉన్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ శాఖలో అభిషేక్ కుమార్ (Abhishek Kumar) మేనేజర్‌గా పని చేస్తున్నాడు. కొద్ది నెలల క్రితం రవీంద్ర హుడా గార్డుగా చేరాడు. ఇటీవల సెలవు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు చెలరేగాయి. సెలవు మంజూరు చేయకపోగా జీతంలో కోత విధించారనే కారణంతో హుడా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. సోమవారం బ్యాంక్‌లోనే మేనేజర్ క్యాబిన్‌లోకి వెళ్లి కాల్పులు జరిపాడు. గాయపడిన మేనేజర్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన తర్వాత పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితుడు హుడా (Hooda) తో పాటు అతని మిత్రుడు శిశుపాల్ (Shishupal) ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.








‘బందర్ రోడ్డుపై తేల్చుకుందాం’.. సాయికృష్ణ ఫ్యామిలీ ఓపెన్ ఛాలెంజ్