ఏలూరు టీడీపీ (Eluru TDP) ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ (Putta Mahesh Yadav) డ్రగ్స్ కేసులో (Drugs Case) అడ్డంగా దొరికిపోయినా, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై వైసీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. “రాష్ట్రంలో సామాన్యుడు కోడిని కోస్తే (Slaughtering a Hen) నాన్-బెయిలబుల్ కేసులు పెట్టి రోడ్ల మీద పరేడ్ చేయించే మీరు.. డ్రగ్స్ సేవించిన ఎంపీకి రెడ్ కార్పెట్ వేస్తారా?” అంటూ సోషల్ మీడియా వేదికగా కూటమి సర్కార్‌పై (Alliance Government) ఘాటు ప్రశ్నలు సంధించింది.
అడ్డంగా దొరికిన ఎంపీ!
హైదరాబాద్ (Hyderabad) డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఎంపీ పుట్టా మహేష్ ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని వైసీపీ(YSRCP) ఆరోపించింది. డ్రగ్స్ పరీక్షలను తారుమారు చేసేందుకు యూరిన్ శాంపిల్‌కు (Urine Sample) బదులుగా ట్యాప్ వాటర్ ఇచ్చారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, చివరకు రక్త పరీక్షల్లో కొకైన్/మెథాంఫేటమిన్ పాజిటివ్‌గా (Cocaine Positive) తేలిందని గుర్తు చేసింది. ఇంత పక్కా ఆధారాలతో దొరికిన వ్యక్తితో ఎంపీ పదవికి రాజీనామా చేయించాల్సింది పోయి, షోకాజ్ నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడింది.
“మీ చట్టం.. మీ ధర్మం ఇదేనా బాబూ?”
చంద్రబాబు (Nara Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), లోకేష్‌లు (Nara Lokesh) చెప్పే ధర్మం ఇదేనా అని వైసీపీ ప్రశ్నించింది. రాజకీయ కక్షలతో అమాయకులను వేధిస్తున్న కూటమి నేతలు, తమ పార్టీ ఎంపీ దొరకగానే ‘హాట్‌లైన్’ రాజకీయాలు చేసి బెయిల్ ఇప్పించడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇది సమాజానికి, ముఖ్యంగా యువతకు చాలా తప్పుడు సంకేతాలు పంపుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
మహిళలపై నేరాలు.. కమిటీల పేరుతో కాలయాపన!
కేవలం డ్రగ్స్ మాత్రమే కాదు, మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలోనూ కూటమి నేతలకు ఒక చట్టం, ఇతరులకు మరో చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపణల జాబితాను విడుదల చేసింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) అత్యాచారం చేశారని బాధితురాలు స్వయంగా ఫిర్యాదు చేసినా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, కూన రవికుమార్, నసీర్ అహ్మద్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలల వీడియోల గురించి ప్రశ్నించింది.
“తాట తీస్తాం” అనేది కేవలం డైలాగులేనా?
“తప్పు చేస్తే తాట తీస్తాం.. ఎవరినీ వదల బొమ్మ” అని పదేపదే చెప్పే మాటలు కేవలం సినిమా డైలాగులకే పరిమితమయ్యాయని, చేతల్లో కూటమి ప్రభుత్వం శూన్యమని వైఎస్సార్‌సీపీ ఎద్దేవా చేసింది. ఇప్పటికైనా డ్రగ్స్ కేసులో దొరికిన ఎంపీతో రాజీనామా చేయించి, నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించింది.








కూటమి ఒక ‘డ్రామా కంపెనీ’.. బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు – జడ శ్రవణ్