మెగా కోడలు పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియాలో (Social Media) తనపై, తన కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు (Abusive comments), దూషణలు చేస్తున్నారంటూ నటి, మెగా బ్రదర్ నాగబాబు కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె హైదరాబాద్ (Hyderabad) సైబర్ క్రైమ్ పోలీసులకు (Cyber Crime Police) ఫిర్యాదు చేసింది.
లావణ్య త్రిపాఠి తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, ‘పర్పుల్ క్రెయాన్00’ (Purple Crayon00) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (Instagram Account) ద్వారా తనపై, తన కుటుంబ సభ్యులపై అవమానకరమైన పోస్టులు, అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికగా దూషణలు, అవమానకర పోస్టులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ఐటీ యాక్ట్ సెక్షన్ 67తో పాటు బీఎన్ఎస్ఎస్ 78, 79 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిర్వహిస్తున్న వ్యక్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.









ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు