వెలుగుమట్ల భూ వివాదం.. కవితతో పాటు 33 మందిపై కేసులు

వెలుగుమట్ల భూ వివాదం.. కవితతో పాటు 33 మందిపై కేసులు

Summarize with AI

ఖమ్మం నగరంలో వెలుగుమట్ల (Velugumatla) భూ బాధితుల సమస్య మరోసారి రాజకీయంగా వేడెక్కింది. భూదాన భూముల్లో (Bhoodan Lands) గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారికి పట్టాలు (Land Pattas) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జాగృతి అధినేత కవిత (Kavitha) సోమవారం రాత్రి పునరావాస కేంద్రంలో నిరాహార దీక్ష చేపట్టారు. గత నెల 24న పోలీసులు వెలుగుమట్ల వద్ద గుడిసెలు తొలగించడంతో ఈ వివాదం మొదలైంది. ఇప్పటికే పలువురు నేతలు బాధితులను పరామర్శించగా, కవిత కూడా బాధితులను కలిసి అంబేద్కర్ విగ్రహం (Ambedkar Statue) వద్ద సుమారు నాలుగున్నర గంటల పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అయితే తర్వాత మళ్లీ రాత్రి పునరావాస కేంద్రానికి వెళ్లి కవిత తన నిరాహార దీక్షను కొనసాగించారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు మరోసారి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో కవితతో పాటు మరో 33 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment