లడ్డూపై చర్చ – మండలిలో హైడ్రామా.. ప్రభుత్వం పలాయనం

లడ్డూపై చర్చ - మండలిలో హైడ్రామా.. ప్రభుత్వం పలాయనం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనమండలి (Legislative Council)లో తిరుమల లడ్డూ ప్రసాదం (Tirumala Laddu Prasadam) అంశంపై తీవ్ర దుమారం రేగింది. ఈ సున్నితమైన అంశంపై చర్చకు సిద్ధమైన వైసీపీని(YSRCP) అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. లడ్డూ ప్రసాదంపై లఘు చర్చను వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి (Chandrashekar Reddy) ప్రారంభించగా, అధికార పక్షం వ్యూహాత్మకంగా అడ్డుతగిలింది. చర్చ జరగకుండా అడ్డుపడిందని విపక్ష సభ్యులు మండిపడుతున్నారు.

చర్చ ప్రారంభమైన కొద్దిసేపటికే శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) జోక్యం చేసుకుని హడావిడి చేశారు. ప్రభుత్వం తరఫున తాము స్టేట్‌మెంట్ ఇస్తామంటూ చర్చకు ఆటంకం కలిగించారు. అయితే, లఘు చర్చ (Short Discussion) ప్రారంభమైన తర్వాత మధ్యలో ప్రభుత్వం స్టేట్‌మెంట్ ఇవ్వడం అనేది శాసనసభ లేదా మండలి చరిత్రలో ఎప్పుడూ జరగలేదని వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు ధ్వజమెత్తారు.

వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి తన వాదనను వినిపించేందుకు ప్రయత్నిస్తుండగా, మంత్రి పయ్యావులతో పాటు అధికార పక్ష సభ్యులు అరుపులు, కేకలతో సభను హోరెత్తించారు. విపక్ష సభ్యుడిని మాట్లాడనివ్వకుండా ఉద్దేశపూర్వకంగానే ఈ గందరగోళం సృష్టించారని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో ఛైర్మన్ మోషేన్ రాజుపై కూడా మంత్రి పయ్యావుల అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. తాము చెప్పినట్టుగా వినాలన్నట్టుగా మంత్రి మాట్లాడటం సభా మర్యాదలకు విరుద్ధమని విపక్షం ఆరోపించింది.

ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించడానికి భయపడి, చర్చ నుంచి పలాయనం చిత్తగించడానికే ఇదంతా చేస్తోందని వైసీపీ విమర్శించింది. లడ్డూ ప్రసాదం వంటి పవిత్రమైన అంశంపై క్లారిటీ ఇవ్వాల్సింది పోయి, కేవలం రాజకీయ లబ్ధి కోసం చర్చను తొక్కేస్తున్నారని మండిపడింది. గందరగోళం మిన్నంటడంతో చేసేదేమీ లేక ఛైర్మన్ సభను వాయిదా వేశారు. దీంతో మండలిలో చర్చ అసంపూర్తిగానే ముగిసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment