అనంతబాబు (Anantababu) డ్రైవర్ సుబ్రహ్మణ్యం (Subrahmanyam) హత్య కేసులో ఏపీ పోలీసుల (AP Police) దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై దర్యాప్తును కావాలనే సాగదీస్తున్నారన్న అభిప్రాయాన్ని ధర్మాసనం వెల్లడించడం సంచలనంగా మారింది.
కూటమి ప్రభుత్వం (Coalition Government) వచ్చిన తరువాత వైసీపీ నేతలపై నమోదైన పాత కేసులను తవ్వితీస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్సీ(YSRCP MLC) అనంతబాబు కేసులో విచారణ మళ్లీ విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏపీ పోలీసుల పనితీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. “మీకు చేతకాకపోతే చెప్పండి… కేసును సీబీఐకి అప్పగిస్తాం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యం వహించారని, కేసు పురోగతిలో స్పష్టత లేదని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో, ట్రయల్‌ను వేగవంతం చేయాలని కోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 30లోగా ట్రయల్ పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు అనంతబాబుకు ఇచ్చిన బెయిల్‌ను పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
అనంతబాబును లోపల ఉంచడమే మీ ఉద్దేశమా? అంటూ పోలీసులను ధర్మాసనం ప్రశ్నించినట్లు సమాచారం. కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమయపాలనతో జరగాల్సిన అవసరాన్ని న్యాయస్థానం గుర్తు చేసింది. ఈ పరిణామాలతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రయల్ వేగవంతం కానున్న నేపథ్యంలో, తదుపరి విచారణలు ఎలా సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.







