గుంటూరు బ‌య‌ల్దేరిన వైఎస్ జ‌గ‌న్‌.. అడుగ‌డుగునా పోలీస్‌ ఆంక్షలు

గుంటూరు బ‌య‌ల్దేరిన వైఎస్ జ‌గ‌న్‌.. అడుగ‌డుగునా పోలీస్‌ ఆంక్షలు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనకు బ‌య‌ల్దేరారు. టీడీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం, కార్యాలయాన్ని పరిశీలించడంతో పాటు ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.

ఇటీవల టీడీపీ అల్ల‌రి మూక‌లు అంబటి రాంబాబు ఇంటి, ఆఫీసుపై విచక్షణారహితంగా దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన వైఎస్ జగన్, బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు గుంటూరుకు వెళ్లాలని నిర్ణయించారు.

అయితే జగన్ పర్యటనకు ముందు నుంచే గుంటూరులో పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. నగరాన్ని అష్టదిగ్బంధనం చేస్తూ నలువైపులా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరుకాకుండా నోటీసులు జారీ చేయడంపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి పర్యటనకే అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్య విరుద్ధమని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

ఈ క్రమంలో ఎంఎల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇంటికి అర్ధరాత్రి రెండుసార్లు పోలీసులు వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఇంటి గోడకు నోటీసు అంటించి ఫోటోలు తీసుకొని, వెంటనే తొలగించి వెళ్లిపోయిన పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు ఫైరవుతున్నాయి. ఇది భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నమేనని ఆరోపిస్తున్నారు.

అంబటి రాంబాబు విషయంలో టీడీపీ శ్రేణుల దాడులు మరింత సంచలనంగా మారాయి. చంద్రబాబుపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, రెచ్చగొట్టిన వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అంతేకాదు, అలా మాట్లాడకూడదని భావించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని ప్రకటించినప్పటికీ, టీడీపీ గూండాలు హత్యాయత్నానికి పాల్పడడంతో పాటు ఆయన ఇల్లు, కార్యాలయంపై విధ్వంసం సృష్టించారు. పోలీసుల ఆంక్షలు, టీడీపీ శ్రేణుల దాడులపై జగన్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment