స్వర్ణాంధ్ర–2047 దిశగా ‘కూటమి’ అడుగులు – గ‌ణ‌తంత్ర వేడుక‌లో గవర్నర్

స్వర్ణాంధ్ర–2047 దిశగా అడుగులు - గ‌ణ‌తంత్ర వేడుక‌లో గవర్నర్ కీలక వ్యాఖ్యలు

Summarize with AI

అమరావతి (Amaravati)లో తొలిసారిగా జాతీయ జెండా ఎగురవేశామని, ఇది రాష్ట్ర పునర్నిర్మాణానికి సంకేతమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Governor Justice Abdul Nazeer) అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ దిశపై గ‌వ‌ర్న‌ర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) స్పష్టమైన దిశ లేకుండా నిలిచిపోయిందని, రాజధాని నిర్మాణం ఆగిపోవడం వల్ల ఆర్థిక విశ్వాసం దెబ్బతిందని వ్యాఖ్యానించారు.

2047 నాటికి ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే చంద్ర‌బాబు ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ స్పష్టం చేశారు. కాలానుగుణంగా పాలన మారాలనే సిద్ధాంతంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. సాంకేతికతను వినియోగించి క్షణాల్లో పాలన ప్రజల వద్దకు చేరేలా వ్యవస్థను రూపుదిద్దుతున్నామని చెప్పారు.

ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికతో ముందుకెళ్తోందని, పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యమని గవర్నర్ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను రూ.4వేలకు పెంచామని, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకం, ఆటో డ్రైవర్లకు రూ.436 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, ట్రైబల్ వెల్ఫేర్ కింద రూ.8వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఇమామ్‌లు, మౌజంలు, పాస్టర్లకు కూడా ప్రభుత్వం సాయం అందిస్తోందన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment