భారత సినీ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న సినిమా ‘వారణాసి’ (Varanasi) మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2027లో విడుదల కానుంది అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘COMING IN 2027’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, మహేశ్ బాబు ఫాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో టైటిల్‌ను రివీల్ చేసిన మేకర్స్, అప్పుడే విడుదల సంవత్సరాన్ని కూడా ప్రకటించారు. అయితే షూటింగ్ షెడ్యూల్‌పై వచ్చిన సందేహాలకు చెక్ పెడుతూ, 2027 రిలీజ్‌పై మరోసారి స్పష్టత ఇచ్చారు.
పవిత్ర నగరం వారణాసి నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆధ్యాత్మికత, చరిత్ర, భావోద్వేగాల సమ్మేళనంగా ఉండబోతుందన్న అంచనాలు ఇప్పటికే నెలకొన్నాయి. 2027లో ఉగాది లేదా శ్రీరామనవమి సందర్భంగా సినిమా విడుదలయ్యే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మహేశ్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, విలన్ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. తాజా అప్డేట్తో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరగగా, స్కేల్, విజువల్స్, కథ విషయంలో రాజమౌళి ఎలాంటి రాజీ పడకుండా భారీ ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపై వచ్చే ప్రతి అప్డేట్తో ‘వారణాసి’ అంచనాలు మరింత ఆకాశాన్ని తాకడం ఖాయం.








