సోనియా గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

సోనియా గాంధీ అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన సోనియా

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) అస్వస్థతకు గురవడం రాజకీయ వర్గాల్లో ఆందోళనకు దారి తీసింది. తీవ్రమైన దగ్గు (Severe Cough)తో బాధపడుతున్న ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో (Sir Ganga Ram Hospital, New Delhi) చేర్చగా, ప్రస్తుతం వైద్యుల అబ్జర్వేషన్‌లో చికిత్స కొనసాగుతోంది. సీనియర్ పల్మనాలజిస్టు పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నామని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గత కొద్ది రోజులుగా దగ్గు సమస్య ఎక్కువ కావడంతో ముందస్తు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చిందని సమాచారం.

ఇదిలా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న తీవ్రమైన గాలి కాలుష్యం (Air Pollution) కూడా సోనియా గాంధీ ఆరోగ్య సమస్యలకు ఒక కారణంగా భావిస్తున్నారు. ఇప్పటికే కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండగా, తాజాగా గాలిలో మందులకు లొంగని ప్రమాదకర బ్యాక్టీరియా స్థాయులు పెరిగినట్లు జేఎన్‌యూ అధ్యయనం వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో నివసించే ప్రజలు ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిందని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు మరింత బలపడుతున్న వేళ, సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment