టీటీడీలో ‘50 కేజీల బంగారం మాయం’.. సాధ్యమా..? వాస్త‌వాలిలా..!!

టీటీడీలో ‘50 కేజీల బంగారం మాయం’.. సాధ్యమా..? వాస్త‌వాలిలా..!!

తిరుమలలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం (Sri Govindaraja Swamy Temple, Tirumala)లో 50 కేజీల బంగారం (50 kilograms of Gold) మాయమైందన్న ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని గత వైసీపీ ప్రభుత్వంపై నెపం మోపుతూ టీడీపీ(TDP) అనుకూల పత్రిక ఈనాడు సంచలన కథనం ప్రచురించగా, ప్ర‌స్తుత టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు (B R Naidu)కు సంబంధించిన టీవీ-5 ఛానెల్‌లో కూడా బంగారం మాయ‌మైన‌ట్లుగా ప్ర‌సారాలు న‌డిపింది. ఈ నేప‌థ్యంలో, టీటీడీ అధికారులు గ‌తంలో స్పష్టమైన వివ‌ర‌ణ ఇస్తూ విడుద‌ల చేసిన వీడియోలు వైర‌ల్‌గా మారాయి.

50 కేజీల బంగారం మాయమైందన్న ఆరోపణలు వాస్తవమే అయితే, అవి ఎలా జరిగాయో స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత టీటీడీ(TTD)పై ఉందని ఒక వర్గం ప్రశ్నిస్తుండగా, అదే సమయంలో ఇలాంటి నిరాధార ఆరోపణలతో దేవాలయ ప్రతిష్టను రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ మరో వర్గం తీవ్రంగా విమర్శిస్తోంది. దేవుడి ప్రభను, ఆయన శక్తిని, ఆధ్యాత్మికతను పెంపొందించాల్సిన టీటీడీని పూర్తిగా రాజకీయ కూపంలోకి నెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్లప్పుడూ రాజకీయాలు చేయడం, బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శకులు మండిపడుతున్నారు.

మొన్నటి వరకు నెయ్యి అంశం, ఆ తరువాత పరకామణి కేసు పేరిట తప్పుడు ప్రచారాలు చేశారని, ఇప్పుడు అదే తరహాలో శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం బంగారు తాపడం అంశాన్ని వక్రీకరిస్తున్నారని వైసీపీ నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ అధికారులు ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు స్పష్టమైన వివరణ ఇచ్చినట్టు చెబుతున్నారు.

బంగారంపై ఐదు అంచెల భ‌ద్ర‌త‌
స్ట్రాంగ్ రూం నుంచి వర్కర్స్‌కు బంగారం ఇచ్చే సమయంలో, తిరిగి స్ట్రాంగ్ రూంకు తీసుకువచ్చే వరకు మొత్తం ప్రక్రియ సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలోనే జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, ప్రత్యేక పర్యవేక్షణ బృందం, AEO జువెలరీ సెక్షన్, ఇతర సంబంధిత విభాగాలు అన్నీ కలిసి పని చేస్తాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తిరుమల జీయంగర్ స్వామీజీల సూచనల మేరకు, అనుభవజ్ఞులైన స్థపతుల పర్యవేక్షణలో, సంప్రదాయ శిల్పశాస్త్ర నియమాల ప్రకారమే పనులు జరిగాయని వెల్లడించారు.

2023లోనే క్లారిటీ… మళ్లీ అదే ఆరోపణలు?
ఈ అంశంపై 2023లోనే టీటీడీ AEO స్పష్టమైన వివరణ ఇచ్చారని, అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ అదే ఆరోపణలను తెరపైకి తెచ్చి, రాజకీయ లబ్ధి కోసం గత ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ‌తంలో ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇలాంటి దుష్ప్ర‌చారాల‌ను ఖండిస్తూ వీడియో ఆధారిత ట్వీట్లు చేశారు. తాజాగా ఈనాడు పత్రికతో పాటు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సొంత మీడియా ఛానెల్ టీవీ5లోనూ బంగారం మాయం వంటి ప్రసారాలు జరగడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. “50 కేజీల బంగారం మాయమైందని టీటీడీనే అనుమానించేలా కథనాలు వస్తుంటే, పాలకమండలి ఎందుకు స్పందించడం లేదు? వాస్తవాలు ఎందుకు వెల్లడించడం లేదు?” అనే ప్రశ్నలు భ‌క్తుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

ఆలయ ప్రతిష్టపై రాజకీయ దాడి?
ఆలయ ప్రతిష్టను రాజకీయ ఉద్దేశాలతో దెబ్బతీస్తున్నప్పుడు కూడా టీటీడీ స్పందించకపోతే, అది తెలుగుదేశం పార్టీ అనుకూల‌ మీడియా సహాయంతో జరిగే రాజకీయ ఆటలో పావుగా మారడమేనని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఇలా మౌనంగా ఉండటం ద్వారా పాపం మూటగట్టుకునే పరిస్థితి రావొచ్చని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. నిజానిజాలు వెల్లడించి, ఇకనైనా అనుమానాలను నివృత్తి చేసి శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment