గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు ఎంత కీలకమో మరోసారి నిరూపితమైంది. నిర్మల్ జిల్లా (Nirmal District) లోకేశ్వరం మండలం (Lokeshwaram Mandal) బాగాపూర్ గ్రామంలో (Bagapur Village) జరిగిన సర్పంచ్ ఎన్నికలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అమెరికా నుంచి స్వగ్రామానికి వచ్చి ఓటు వేసిన మామ కారణంగా కోడలు కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఎన్నికల్లో ముత్యాల శ్రీవేద (Muthyala Sriveda) సర్పంచ్ పదవికి పోటీ చేశారు. ఆమె ఎన్నికల్లో ఉన్న విషయం తెలుసుకున్న మామ ముత్యాల ఇంద్రకిరణ్ రెడ్డి (Muthyala Indrakiran Reddy) అమెరికాలో నివసిస్తున్నప్పటికీ ప్రత్యేకంగా నాలుగు రోజుల ముందే స్వగ్రామానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామ పంచాయతీలో మొత్తం 426 ఓట్లు ఉండగా, 378 ఓట్లు పోలయ్యాయి. ఇందులో శ్రీవేదకు 189 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థి హర్ష స్వాతికి (Harsha Swathi) 188 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో ఓటు చెల్లనిదిగా మారడంతో చివరికి ఒక్క ఓటు మెజార్టీతో శ్రీవేద గెలుపొందినట్లు ఎంపీడీవో (MPDO) ప్రకటించారు.
ఫలితాలు వెలువడిన అనంతరం, ముత్యాల శ్రీవేద తన మామ ఇంద్రకిరణ్ రెడ్డి వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సంఘటన గ్రామంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా “ఒక్క ఓటు విలువ”పై చర్చకు దారి తీసింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంత కీలకమో చెప్పే ఉదాహరణగా ఈ విజయం నిలిచిపోయింది.









పిఠాపురంలో నాగబాబు.. వర్మ ఎపిసోడ్‌పై సైలెన్స్