సోషల్ మీడియాలో హార్దిక్ ఘనతపై అభినందనల వర్షం

సోషల్ మీడియాలో హార్దిక్ ఘనతపై అభినందనల వర్షం

భారత (India) ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో (International T20 Cricket) అరుదైన ఘనత సాధించాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో (South Africa) జరిగిన మ్యాచ్‌లో తక్కువ మ్యాచ్‌ల్లోనే 1000కిపైగా పరుగులు, 100కు పైగా సిక్సర్లు, 100కుపైగా వికెట్లు తీసిన ఆటగాళ్ల ప్రత్యేక క్లబ్‌లో చేరాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా హార్దిక్ నిలవడం విశేషం. ఈ జాబితాలో ఆయనతో పాటు జింబాబ్వేకు చెందిన సికందర్ రజా, అఫ్గానిస్తాన్ ఆటగాడు మహమ్మద్ నబీ, మలేషియా క్రికెటర్ వీరందీప్ సింగ్ ఉన్నారు.

అలాగే, భారత జట్టు తరఫున టీ20ల్లో 100 వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా ఈ ఘనతను అందుకున్నారు. హార్దిక్ ఇప్పటివరకు 123 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 26.78 సగటుతో 100 వికెట్లు తీయగా, అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/16గా ఉన్నాయి. అదే సమయంలో 122 మ్యాచ్‌ల్లో 1,939 పరుగులు, 141.53 స్ట్రైక్‌రేట్‌తో 101 సిక్సర్లు బాదాడు. ఈ ఘనతపై సోషల్ మీడియాలో ఆయనకు అభినందనల వెల్లువెత్తాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ (61) పోరాడినా, దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 117 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో భారత్ 15.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సులువుగా విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Join WhatsApp

Join Now

Leave a Comment