‘చంద్ర‌బాబు కేసు క్లోజ్ చేయొద్దు’.. ఫైబర్ నెట్ కేసులో సంచలన మలుపు

'చంద్ర‌బాబు కేసు క్లోజ్ చేయొద్దు'.. ఫైబర్ నెట్ కేసులో సంచలన మలుపు

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఫైబర్ నెట్ కేసు (FiberNet Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ప్రభుత్వం కాలంలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణల ఆధారంగా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Former CM Nara Chandrababu Naidu)పై సీఐడీ (CID) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ కేసు మూసివేత దిశగా సాగుతోందనే వార్తలు బయటకు రావడంతో, వ్యవహారం చుట్టూ మళ్లీ రాజకీయ వేడి పెరిగింది.

ఈ నేపథ్యంలో, ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌కు అప్పట్లో చైర్మన్‌గా వ్యవహరించిన గౌతమ్ రెడ్డి (Gautam Reddy) ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబుపై నమోదైన సీఐడీ కేసును క్లోజ్ చేయకుండా నిలిపివేయాలని కోరుతూ ఆయన కీలకమైన పిటిషన్‌ను దాఖలు చేశారు. అప్ప‌ట్లో జ‌రిగిన వ్యవహారాలకు సంబంధించి పలువురు బాధ్యత వహించాల్సి ఉన్నప్పటికీ, కేసును మూసివేయడం సరైన నిర్ణయం కాదని పిటీష‌న్‌లో ఆయ‌న కోర్టుకు వివరించినట్లు సమాచారం.

ఈ పిటిషన్‌పై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టనుంది. కేసు మూసివేతపై వచ్చిన వార్తలు, గౌతమ్ రెడ్డి పిటిషన్, కోర్టు విచారణ ఈ వ్యవహారం మరింత సీరియస్ మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఫైబర్ నెట్ కేసు ప్రారంభమైనప్పటి నుండి సంచ‌ల‌నాలు సృష్టిస్తూనే ఉంది. కేసు క్లోజ్ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో గౌత‌మ్‌రెడ్డి పిటీష‌న్ కేసు తీవ్ర‌త‌ను మ‌రింత పెంచింది. కోర్టు సోమవారం తీసుకోబోయే నిర్ణయం ఈ కేసు భవిష్యత్తుకు కీలకంగా మారనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment