క్రికెట‌ర్ శ్రీ‌చ‌ర‌ణికి ఏపీ ప్ర‌భుత్వం భారీ న‌జ‌రానా

క్రికెట‌ర్ శ్రీ‌చ‌ర‌ణికి ఏపీ ప్ర‌భుత్వం భారీ న‌జ‌రానా

Summarize with AI

మ‌హిళ‌ల (Women’s) వ‌న్డే (ODI) ఇంట‌ర్నేష‌న‌ల్ ప్ర‌పంచ క‌ప్ (International World Cup) టోర్నీలో స‌త్తా చాటిన క‌డ‌ప (Kadapa) బిడ్డ శ్రీ‌చ‌ర‌ణి (Sricharani)పై యావ‌త్ దేశ‌మంతా ప్ర‌శంస‌లు కురిపించింది. టీమిండియా ఢిల్లీ (Delhi)లో ప్ర‌ధాని (Prime Minister), రాష్ట్ర‌ప‌తి (President)తో వేర్వేరుగా స‌మావేశం అయ్యింది. అనంత‌రం క్రికెట‌ర్ శ్రీ‌చ‌ర‌ణి స్వ‌రాష్ట్రం ఏపీ చేరుకుంది. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌లో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు క్రీడాభిమానులు.

క్రికెటర్ శ్రీచరణి ఉండ‌వ‌ల్లి కరకట్ట వద్ద గల సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను కలిశారు. ఇటీవల భారత్‌కు గౌరవం తెచ్చిన ఆమె విజయంపై సీఎం ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా మాజీ భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

రూ. 2.5 కోట్లు, గ్రూప్-1 ఉద్యోగం
భారత జట్టుకు విజయాన్ని అందించినందుకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున శ్రీచరణికి రూ. 2.5 కోట్లు నగదు బహుమతి, గ్రూప్-1 ఉద్యోగం, అలాగే ఆమె స్వగ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

శ్రీచరణి స్పందన
సీఎంను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన శ్రీచరణి, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “గేమ్‌లో నాకు ఏం వచ్చిందో అదే చేశాను, ఎప్పుడూ ఫలితం గురించి ఆలోచించలేదు. ఇది మా టీమ్ ఎఫర్ట్‌ ఫలితం. నా వెనుక ఎప్పుడూ ఏసీఏ (Andhra Cricket Association) ఉంది, నా కుటుంబం ఎప్పుడూ నాతో ఉంది” అని ఆమె చెప్పింది. తన ట్రైనర్ దినేష్ చిన్నప్పటి నుంచే ఎంతో సహాయం చేశారని, తండ్రిని ఒప్పించి క్రికెట్‌లోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంది. “ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా చాలా చేయాలి అని ప్రధాని కూడా చెప్పారు” అని శ్రీచరణి అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment