మహిళల క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది. ఉమెన్స్ ODI వరల్డ్ కప్ ఫైనల్లో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి, తొలిసారిగా వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 298/7 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ (87), దీప్తీ శర్మ (58) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు బలమైన పునాది వేశారు. 299 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు తడబడింది. లారా (101) శతకం సాధించినప్పటికీ, అన్నేరీ (35) తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు.
భారత్ బౌలింగ్ విభాగం అదరగొట్టింది. దీప్తీ శర్మ 5 వికెట్లు తీయగా, షెఫాలీ 2, శ్రీ చరణి 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు ప్రపంచ కప్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసింది.








