20 ఏళ్ల బంధానికి తెర? సెహ్వాగ్ మౌనం, నెటిజన్ల ప్రశ్నలు!

20 ఏళ్ల బంధానికి తెర? సెహ్వాగ్ మౌనం, నెటిజన్ల ప్రశ్నలు!

టీమిండియా (Team India) మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag), తన సతీమణి ఆర్తి అహ్లవత్‌ (Aarti Ahlawat)కు విడాకులు (Divorce) ఇచ్చారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 20 ఏళ్ల వీరి వైవాహిక బంధానికి గత రెండేళ్లుగా స్వస్తి పలికారని తెలుస్తోంది. విడాకులపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, తాజాగా 2025 దీపావళి పండుగ సందర్భంగా సెహ్వాగ్ చేసిన ఒక పోస్ట్ ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది.

దీపావళి సందర్భంగా సెహ్వాగ్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. ఒక ఫొటోలో ఆయన ఒంటరిగా ఉండగా, మరొక ఫొటోలో తన తల్లి, ఇద్దరు కుమారులు (ఆర్యవీర్, వేదాంత్) మాత్రమే ఉన్నారు. “నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మెరుపును వదిలి వెళ్ళు” అంటూ సంస్కృత శ్లోకంతో పోస్ట్ చేశారు. అయితే, ఈ పోస్ట్‌లో ఎక్కడా ఆర్తి అహ్లవత్ లేకపోవడం చూసి, ‘విడాకులు నిజమే’ అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

గతంలో, వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, గత ఏడాది దీపావళి పోస్ట్‌లోనూ ఆర్తి లేకపోవడం వంటి పరిణామాలు విడాకుల వార్తలకు బలం చేకూర్చాయి. వీరిద్దరి బంధంలో మనస్పర్థలు వచ్చి 2-3 ఏళ్ల క్రితమే విడిగా ఉంటున్నారని సమాచారం. విడాకుల విషయంపై సెహ్వాగ్ కానీ, ఆర్తి కానీ ఇప్పటివరకు స్పందించలేదు. బీసీసీఐలో ఉన్న ఓ కీలక వ్యక్తితో ఆర్తికి సంబంధాలు ఉండడం వల్లే వీరూ ఆమెకు దూరమయ్యారనే ప్రచారం కూడా నెట్టింట జరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment