రాజమండ్రిలో టీడీపీ నేత మద్యం దందా.. ఆడియో కలకలం

రాజమండ్రిలో టీడీపీ నేత మద్యం దందా.. ఆడియో కలకలం

క‌ల్తీ మ‌ద్యంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రం వ‌ణికిపోతోంది. ఈ నేప‌థ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి నగర రాజకీయాల్లో భారీ సంచలనం రేగింది. టీడీపీ సిటీ ఇన్‌ఛార్జ్ మజ్జి రాంబాబు (Mazji Rambabu) మద్యం (Liquor) అక్రమ వ్యాపారం (Illegal Business)పై మాట్లాడిన ఫోన్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాజమండ్రి (Rajahmundry) అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఉన్న 39 మద్యం షాపులను సిండికేట్ చేయడం, వాటి నిర్వహణపై స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చినట్లు లీకైన ఆ ఆడియోలో ఉండ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీ(TDP) నేత రాంబాబు ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉంచాలి, ఎక్సైజ్ అధికారులతో ఎలా మాట్లాడాలి వంటి విషయాలను ఆ ఆడియోలో వెల్ల‌డించారు. నార్త్, సౌత్ ఎక్సైజ్ సీఐలను కూర్చోబెట్టి చర్చిద్దామని, 39 షాపుల నిర్వాహకులను బాండ్లపై సంతకాలు చేయించాలనడం, మద్యం దుకాణాల పరిధిలో ఉన్న బెల్ట్ షాపుల విషయంలో మరొకరికి జోక్యం ఉండకూడదని చెప్పడం ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.

ఇంకా టీడీపీ నేత‌ రాంబాబు మాట్లాడుతూ.. “39 షాపుల్లో ఎవరి మీద కేసు నమోదు చేసినా అందరం కలసి భరిద్దాం, ఎవరికెంత కమిషన్ ఇవ్వాలో నిర్ణయిద్దాం, రెండోసారి కేసు పడితే షాపు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటాం” అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మద్యం అక్రమ వ్యాపారాన్ని లీగలైజ్ చేయడానికి ప్రయత్నించినట్లు ఈ సంభాషణలో ప్రతిబింబిస్తోంది.

తెలుగుదేశం పార్టీ మద్యం అక్రమ దందాపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం సిండికేట్‌పై సాక్ష్యాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అధికార పార్టీ నేతలు “రాజకీయ నాయకులు స్వయంగా అక్రమ దందాలకు మార్గం వేస్తున్నారు” అంటూ టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment