వైసీపీ (YSRCP) నేతలపై బనాయించిన మద్యం కేసు (Liquor Case)లో బెయిల్(Bail) పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు (High Court) ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న బెయిల్ రద్దు పిటిషన్లు తేలేవరకు, ఏసీబీ కోర్టు కొత్త బెయిల్ పిటిషన్లను విచారించవద్దన్న హైకోర్టు ఆదేశాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో ఇలాంటి ఆదేశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ పిటీషన్‌పై వ్యాఖ్యానిస్తూ, బెయిల్ రద్దు లేదా మంజూరు పిటిషన్లను మెరిట్ ఆధారంగా నిర్ణయించాలనే దానిపైనే దృష్టి ఉండాలి అని సూచించింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో ఆలస్యం చేయడం సరికాదని, బెయిల్ పిటిషన్లను తక్షణ ప్రాధాన్యతతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఈ వ్యాఖ్యలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా వెలువడ్డాయి. జస్టిస్ జేబీ పార్దివాల, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌ల ధర్మాసనం ఈ కేసును విచారించింది.








‘బందర్ రోడ్డుపై తేల్చుకుందాం’.. సాయికృష్ణ ఫ్యామిలీ ఓపెన్ ఛాలెంజ్