గంజాయి మత్తులో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

గంజాయి మత్తులో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

Summarize with AI

హైదరాబాద్‌ (Hyderabad)లో అత్యంత దారుణమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. గంజాయి మత్తు (Ganja Intoxication)లో ఉన్న ఓ దుండగుడు ఎనిమిదేళ్ల చిన్నారి (Girl Child)పై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం.సైదాబాద్ (Saidabad) పరిధిలోని సింగరేణి కాలనీ (Singareni Colony)లో నివసించే కూలీ దంపతులు తమ కూతురు (8 ఏళ్లు), కుమారుడు (7 ఏళ్లు)తో కలిసి జీవనం సాగిస్తున్నారు. దంపతులు ఇద్దరూ కూలీ పనుల కోసం ఇంటి నుంచి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది.

ఇంటికి సమీపంలో ఉన్న ఓ యువకుడు వీరిద్దరు చిన్నారులను ఇంటికి పిలిచాడు. బాలిక సోదరుడి ముందే ఆమెపై అత్యాచారానికి (Sexual Assault) పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను, ఆమె సోదరుడిని బెదిరించాడు. విషయం వెలుగులోకి: ఆ తరువాత బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చిన్నారి తమ్ముడిని నిలదీయగా, బాలుడు జరిగిన విషయాన్ని వారికి తెలిపాడు. వెంటనే తల్లిదండ్రులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) సహాయంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు మరియు బాలల హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment