కూటమి ప్రభుత్వం (Alliance Government) తనను ఎన్ని కష్టాలకు గురిచేసినా తగ్గేది లేదు, ఇంకా గట్టిగా పోరాడుతానన్నారు వైసీపీ (YSRCP) ఎంపీ(MP) పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి (PeddiReddy Mithun Reddy). జైలు నుంచి బెయిల్(Bail)పై రిలీజ్ అయిన అనంతరం ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడారు. జైలులో తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. 73 రోజులు పాటు జైలు జీవితం గడిపానని, ఇంకా ఎలాంటి కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గనన్నారు. “2014-19లోనూ నాపై తప్పుడు కేసులు పెట్టారు, ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజా సమస్యలను పక్కన పెడుతోంది” అని ఆయన ఆరోపించారు.
తన అరెస్టు వెనుక కక్షపూరిత ఉద్దేశ్యం ఉందని మిథున్ రెడ్డి అన్నారు. “లిక్కర్ కేసు(Liquor Case)తో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా నన్ను అరెస్ట్ చేశారు. నన్ను ఒక టెర్రరిస్ట్‌లా చూశారు. సీసీ కెమెరాలతో నిత్యం నిఘా పెట్టారు. విజయవాడ నుంచి ప్రత్యేక మానిటరింగ్ చేశారు. అధికారులు కూడా భయపడే వాతావరణం సృష్టించారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో కోర్టు ఆదేశాలు వచ్చే వరకు కనీస వసతులు కూడా ఇవ్వలేదని ఆయన తెలిపారు. తన తల్లిదండ్రులను మానసికంగా వేధించారని మండిపడ్డారు.
తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన ఎంపీ మిథున్‌రెడ్డి. కేసులు పెట్టినా సాధించింది ఏమీ లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరారు. ఈ సందర్భంలో మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan)కు కృతజ్ఞతలు తెలిపారు. “నా కష్టకాలంలో అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు. నన్ను కేసులతో వేధించాలనే చంద్రబాబు (Chandrababu) చేసిన ప్రయత్నాలు వృథా అవుతాయి. నేను ఎక్కడా వెనక్కి తగ్గేది లేదు” అని ధీమా వ్యక్తం చేశారు.








