మలయాళ నటుడు మోహన్ లాల్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘హృదయపూర్వం’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఓనం పండుగ సందర్భంగా ఆగస్టు 28న విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది.
థియేటర్లలో భారీ విజయం తర్వాత, ‘హృదయపూర్వం’ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా హక్కులను ముందే కొనుగోలు చేసిన జియో హాట్‌స్టార్, సెప్టెంబర్ 26 నుండి దీన్ని ప్రసారం చేస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి పాన్-ఇండియా భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.








