సవీంద్రారెడ్డి అరెస్టుపై ఏపీ హైకోర్టు సీరియస్

సవీంద్రారెడ్డి అరెస్టుపై ఏపీ హైకోర్టు సీరియస్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సంచలనానికి దారితీసిన వైసీపీ (YCP) సోషల్ మీడియా (Social Media) యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి (Savindra Reddy) కిడ్నాప్‌ (Kidnap), అరెస్టు ఘటనపై హైకోర్టు(High Court) సీరియస్‌గా స్పందించింది. ఆయనపై పోలీసులు అక్రమంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో, హైకోర్టు సవీంద్రారెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.

తాడేపల్లి పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో అనేక సంగతులు బయటపడ్డాయి. రిపోర్టులో “సాయంత్రం 7 గంటలకు సవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నాం” అని పేర్కొన్నారు. కానీ, సవీంద్రారెడ్డి త‌ర‌ఫు న్యాయవాదులు కోర్టులో సమర్పించిన సీసీ కెమెరా ఫుటేజ్‌లో మాత్రం ఆయనను సాయంత్రం 4.30 గంటలకే పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.

ఈ వ్యత్యాసంపై హైకోర్టు పోలీసులను నిలదీసింది. “పోలీసులు చెబుతున్నట్లయితే సాయంత్రం 7 గంటలకు అరెస్ట్ జరిగిందని, అయితే 4.30 గంటలకే వీడియో ఫుటేజ్ ఎలా వచ్చింది?” అని కోర్టు ప్రశ్నించింది. రిమాండ్ రిపోర్టులో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు హైకోర్టు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. అదనంగా, సవీంద్రారెడ్డి కేసులో పోలీసుల చర్యలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, పూర్తి నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాల్లో సవీంద్రారెడ్డి అరెస్టు వ్యవహారం మరింత వేడెక్కింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశం మేరకు ఆయన విడుదలకు మార్గం సుగమమైంది.

మొద‌ట స‌వింద్రారెడ్డి కిడ్నాప్‌కు గుర‌య్యార‌ని ఆయ‌న భార్య ల‌క్ష్మీ ప్ర‌స‌న్న తాడేప‌ల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సైతం సీసీ టీవీ ఫుటేజ్‌ని ప‌రిశీలించిన ఫొటోలు విడుద‌ల‌య్యాయి. మ‌రుస‌టి రోజుకూ త‌న భ‌ర్త ఆచూకీ తెలియ‌క‌పోవ‌డంతో స‌వింద్రారెడ్డి భార్య హైకోర్టులో హెబియ‌స్ కార్ప‌స్ పిటీష‌న్ వేశారు. దీంతో స‌వింద్రారెడ్డిని కోర్టు ఎదుట హాజ‌రుప‌ర‌చాల‌ని ఆదేశించిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment