ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్లు ఆట పరంగానే కాకుండా, మైదానం వెలుపల జరిగిన సంఘటనలతోనూ వార్తల్లో నిలిచాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లు మరియు అంపైర్లతో కరచాలనం చేయకపోవడం వివాదానికి దారితీసింది. అయితే, సూపర్-4 మ్యాచ్ తర్వాత భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచన మేరకు ఆటగాళ్లు అంపైర్లతో మాత్రమే కరచాలనం చేశారు.
ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత్-పాకిస్తాన్ మ్యాచ్ను ఇకపై “పోటీ” అని పిలవవద్దని అన్నారు. “రెండు జట్ల మధ్య 20 మ్యాచ్లు జరిగితే స్కోరు 8-7 ఉంటే అది పోటీ. కానీ 10-1 లేదా 13-0 వంటి గణాంకాలు ఉంటే అది పోటీ కాదు. ఇది ఒక జట్టు బాగా ఆడిన మ్యాచ్ మాత్రమే” అని సూర్యకుమార్ వ్యాఖ్యానించారు.







