పులివెందుల‌లో యూట్యూబ‌ర్‌పై దాడి

పులివెందుల‌లో యూట్యూబ‌ర్‌పై దాడి

పులివెందుల (Pulivendula)లో వైసీపీ (YSRCP) నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నవారిపై దాడులు ఆగడం లేదు. ఇటీవ‌ల జెడ్పీటీసీ (ZPTC)  ఉప ఎన్నిక (By Election) నేప‌థ్యంలో ఓ ఫంక్ష‌న్ హాల్‌లో దాడి అనంత‌రం మ‌రుస‌టి రోజే వైసీపీ ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్‌ (Ramesh Yadav), వేల్పుల రాము (Velpula Ramu)పై అధికార పార్టీ నాయ‌కులు దాడులు చేశారు. ఈ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే తాజాగా జెడ్పీటీసీ ఉప ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రచారం చేశాడని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌, యూట్యూబ‌ర్‌ (YouTuber) ఆది శేషు (Aadi Sheshu)పై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.

ఆది శేషు కారును ధ్వంసం చేసిన ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడి వెనుక టీడీపీ(TDP)కి చెందిన తుమ్మలపల్లి విశ్వనాథ్ రెడ్డి (Tummalapalli Viswanath Reddy) అనుచరులే ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశానని మాత్రమే తనపై దాడి జరిగిందని ఆది శేషు వేదన వ్యక్తం చేశారు.

“మీరెన్ని దాడులు చేసినా నా ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్ కుటుంబానికే అండగా ఉంటాను. పులివెందుల టీడీపీ నేతల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు” అని ఆది శేషు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment