ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసు (Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ (Hyderabad) సమీపంలోని రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా కాచారం (Kacharam)లో సిట్(SIT) అధికారులు సోదాలు చేసి రూ.11 కోట్ల నగదును సీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, సీజ్ చేసిన ఈ నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. సిట్ ఆరోపణలను ఖండిస్తూ, ఈ ఆరోపణలు అసత్యమని, తన బెయిల్‌ను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. కాచారంలోని సులోచన ఫామ్‌హౌస్‌లో సీజ్ చేసిన నగదు తనది కాదని, ఆ ఫామ్‌హౌస్ యజమాని తీగల విజయానందరెడ్డికి వందల కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారాలు ఉన్నాయని రాజ్ కేసిరెడ్డి (Raj Kesireddy) స్పష్టం చేశారు.
రాజ్ కేసిరెడ్డి తన అఫిడవిట్‌లో, తీగల విజయానందరెడ్డి (Vijayananda Reddy)కి ఇంజినీరింగ్ కాలేజీ, ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు వంటి విస్తృత వ్యాపారాలు ఉన్నాయని, అరేట్ ఆస్పత్రిలో తన భార్యకు అతి చిన్న వాటా మాత్రమే ఉందని, దానికి మించి వారి వ్యాపారాలతో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్ల నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో తనను ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ కేసులో A40 వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ సోదాలు నిర్వహించినప్పటికీ, రాజ్ కేసిరెడ్డి తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఈ అఫిడవిట్‌తో కేసు మరింత ఆసక్తికరంగా మారింది, సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.








