హైదరాబాద్ (Hyderabad) కొండాపూర్ (Kondapur)లో నిన్న రాత్రి ఎక్సైజ్ పోలీసులు (Excise Police) రేడ్ (Raid) నిర్వహించి ఓ రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ మూలాలున్నట్టు అధికారులు తేల్చారు. ప్రతి వీకెండ్‌కు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని వివిధ ప్రాంతాల నుండి యువతి, యువకులను రేవ్ పార్టీల (Rave Parties) కోసం హైదరాబాద్‌కి తీసుకువచ్చేవారన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రికి చెందిన 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గంజాయి, డ్రగ్స్, కండోమ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ పార్టీ నిర్వాహకుడు ఉపయోగించే కారు ఏపీ రిజిస్ట్రేషన్ కారు ‘AP 39 SR 0001’పై లోక్‌సభ (Lok Sabha) ఎంపీ(MP) స్టిక్కర్ (Sticker) ఉండడం సంచలనంగా మారింది. ఏపీ నుంచి వచ్చి ప్రతి వీకెండ్ ఈ డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
మంగళగిరి నుంచి మూలాలు
డ్రగ్స్ పార్టీకి గట్టి కింగ్‌పిన్‌గా వ్యవహరిస్తున్న అశోక్ నాయుడు (Ashok Naidu)ను తెలంగాణ ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. అయితే అశోక్ నాయుడు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరికి చెందిన ఓ టీడీపీ నేత కుమారుడిగా పోలీసులు గుర్తించారు. ఇతడు డ్రగ్స్‌కు బానిసలైన యువతులను టార్గెట్ చేసి పార్టీలకు ఆహ్వానించేవాడని విచారణలో వెల్లడైంది. అశోక్ నాయుడు డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులను టార్గెట్ చేసి, డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ సమకూర్చుకుని, నకిలీ ఐడీలతో అపార్ట్‌మెంట్‌లను బుక్ చేసి ఈ పార్టీలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కారుపై ఎంపీ స్టిక్కర్..
డ్రగ్స్ పార్టీ నిర్వాహకుడు అశోక్ నాయుడు వద్ద నుంచి ‘AP 39 SR 0001’ నెంబరు గల ఫార్చునర్ కారును స్వాధీనం చేసుకున్నారు, అందులో లోక్‌సభ ఎంపీ స్టిక్కర్ ఉండటం కలకలం రేపుతోంది. ఆ స్టిక్కర్‌ను ఎవరి ద్వారా పొందాడనే విషయంపై ఎక్సైజ్ శాఖ విచారణ జరుపుతోంది. ఈ కేసులో సీనియర్ రాజకీయ నాయకుల సమీప బంధువుల ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఏపీలో కొకైన్ అమ్మకాలు
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్ మాఫియా కార్యకలాపాలు తీవ్ర రూపం దాల్చాయని, మంగళగిరిలో తొలిసారిగా కొకైన్ స్వాధీనం చేసుకోగా, విశాఖపట్నంలో 25 గ్రాముల కొకైన్, విజయవాడ రైల్వేస్టేషన్‌లో కొకైన్ సీజ్ చేశారు. 25 గ్రాముల కొకైన్ కేసులో విశాఖ పోలీసులు బాధ్యులను గుర్తించలేకపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం డ్రగ్స్‌ను అరికట్టడంలో విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండాపూర్ రేవ్ పార్టీ కేసు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య డ్రగ్ నెట్‌వర్క్‌ను బయటపెట్టింది.
🚨 BIG Breaking 🚨
— Telugu Feed (@Telugufeedsite) July 28, 2025
నిందితుడు అశోక్ నాయుడు కారుకు లోక్‌సభ ఎంపీ స్టిక్కర్
AP 39 SR 0001 నెంబరు ఫార్చునర్ కారుకు ఎంపీ స్టిక్కర్ అంటించుకుని తిరుగుతున్న అశోక్
ఎంపీ స్టిక్కర్ ఎవరిది అన్నదానిపై విచారిస్తున్న ఎక్సైజ్ అధికారులు https://t.co/OPo9gRjjsb pic.twitter.com/Oxv9jeNjJ2








