సింగయ్య మృతి కేసు.. హైకోర్టు కీల‌క తీర్పు

సింగయ్య మృతి కేసు.. హైకోర్టు కీల‌క తీర్పు

పల్నాడు జిల్లా (Palnadu District) రెంటపాళ్ల గ్రామం (Rentapalla Village)లో జరిగిన సింగయ్య (Singayya) మృతి కేసు (Death Case)లో మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై దాఖలైన కేసు విచారణపై ఏపీ హైకోర్టు (AP High Court) సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది. సింగ‌య్య మృతి కేసులో మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనలో జగన్‌తో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, జగన్ కార్యదర్శి నాగేశ్వర రెడ్డిలపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు, దీనిపై విచారణ జూన్ 27న జరిగింది.

జస్టిస్ (Justice) కె. శ్రీనివాస రెడ్డి (K. Srinivas Reddy) నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్, జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతూ, జూలై 1 వరకు పోలీసులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గ‌తంలో ఆదేశించింది. అయితే, తాజాగా ఈ కేసులో మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేస్తూ జగన్‌పై విచారణకు న్యాయ‌మూర్తి స్టే విధించారు. ఈ కేసు విచారణను హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం కోరగా, కోర్టు ఈ అభ్యర్థనను మంజూరు చేసింది. తదుపరి విచారణ జూలై 15న జరగనుంది.

ఈ కేసులో వాదనలు వినాల్సిన అవసరం లేదని అడ్వొకేట్‌ జనరల్ చెప్ప‌డంతో సంఘటన తర్వాత నాలుగు రోజుల తర్వాత వీడియో విడుదల చేశారని వైఎస్ జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించిన‌ట్లుగా స‌మాచారం. సింగ‌య్య వీడియోను సోషల్‌ మీడియా నుంచి డౌన్‌లోడ్ చేసిన‌ట్లుగా ఎస్‌ఐ చెప్పారని, అయితే ఆ వీడియో ఏఐతో ఏదైనా సృష్టించగలిగే అవకాశం ఉంది కదా అని లాజిక్ తీయ‌గా, కౌంటర్‌ దాఖలుకు రెండు వారాల సమయం ఇవ్వండి బెంచ్‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ అడ్వొకేట్‌ జనరల్ కోరిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఆధారాలు ఉన్నా ఇంకా సమయం దేనికి? అని జగన్ న్యాయ‌వాది ప్ర‌శ్నించిన‌ట్లుగా స‌మాచారం. ఆధారాలున్నా అడ్వొకేట్ జనరల్ కౌంట‌ర్ దాఖ‌లుకు రెండు వారాల సమయం కోరడంతో, ఈ కేసు మరింత రాజకీయ చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment