రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫాస్ట్ బౌలర్ (Fast Bowler) యష్ దయాల్ (Yash Dayal) మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఘజియాబాద్ (Ghaziabad)కు చెందిన ఓ యువతి, తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపిస్తూ యష్ దయాల్‌పై ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేయించారు. యువతి అందించిన ఫిర్యాదు ప్రకారం, ఆయనతో గత ఐదు సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు.
శారీరక, మానసిక, ఆర్థిక వేధింపుల ఆరోపణలు
ఫిర్యాదులో యష్ దయాల్ తనను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వేధించారని (Harassed) యువతి పేర్కొన్నారు. తాను ఎంతో విశ్వాసంతో ఈ సంబంధాన్ని కొనసాగించానని, అయితే చివరికి మోసపోయానని బాధితురాలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని యూపీ సీఎం (UP CM) ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసి న్యాయం కోరారు.
చాట్స్, వీడియో కాల్స్ ఆధారాలుగా
బాధితురాలు తానే చెప్పిన విషయాలన్నీ నిజమని, తన వద్ద చాట్‌లు, వీడియో కాల్స్ వంటి ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. అదికాకుండా, యష్ మరో మహిళతో కూడా సంబంధం పెట్టుకున్నట్లు తాను తెలిసిందని, ఆ మహిళ తనను సంప్రదించి ఆయన గురించి నిజాలు చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంకా స్పందించని యష్ దయాల్
ఈ ఆరోపణలపై ఇప్పటివరకు యష్ దయాల్ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇది ఒక వ్యక్తిగత సమస్య అయినప్పటికీ, క్రికెట్ ప్రపంచంలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్రధారి
క్రీడాపరంగా చూస్తే, యష్ దయాల్ 2024 నుండి ఆర్సీబీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2025 ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీకి తొలి టైటిల్ గెలిపించడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించాడు. ఇదివరకు, 2022లో గుజరాత్ టైటాన్స్ తరఫున కూడా టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 43 మ్యాచ్‌లు ఆడి, 41 వికెట్లు పడగొట్టాడు.








సీటు త్యాగం చేసిన వర్మకు సొంత పార్టీలోనే ‘షాక్’