తీసుకెళ్లింది వాహ‌నాన్నే.. ‘బుల్లెట్‌’ను కాదు !!

తీసుకెళ్లింది వాహ‌నాన్నే.. 'బుల్లెట్‌'ను కాదు !!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ (YSRCP) అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan) సొంత బుల్లెట్ ప్రూఫ్ (Own Bulletproof) వాహనాన్ని (Vehicle) పోలీసులు స్వాధీనం చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. రెంట‌పాళ్ల ప‌ర్య‌ట‌న‌ (Rentapalli Tour)లో సింగయ్య (Singayya) మృతి(Death)పై నాలుగు రోజుల త‌రువాత ఒక వీడియో విడుద‌ల చేసిన పోలీసులు.. రెండ్రోజుల త‌రువాత తాడేపల్లి (Tadepalli)లోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి జ‌గ‌న్‌ వాహనాన్ని తీసుకెళ్లారు. ఈ చర్యపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర్షంలో జ‌గ‌న్ కార్యాల‌యానికి వ‌చ్చి బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్‌ను తీసుకెళ్లిన వార్త సామాన్య ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకెళ్లింది. అందుకు వారం రోజులుగా వ‌రుస‌గా జ‌గ‌న్‌పై వెలువ‌డుతున్న క‌థ‌నాలు, ప్ర‌సారాలే ప్ర‌ధాన కార‌ణం. ఏపీ(AP)లో న‌డుస్తున్న రాజ‌కీయ‌ వ్య‌వ‌హారాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న ప్ర‌జ‌లు ఈ చ‌ర్య‌ను తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. జ‌గ‌న్ రెంట‌పాళ్ల ప‌ర్య‌ట‌న‌లో 79 కిలోమీట‌ర్ల‌కు 8 గంట‌ల ప్ర‌యాణం, ఆ త‌రువాతి రోజు ప్రెస్‌మీట్‌.. సుదీర్ఘ ప్రెస్‌మీట్‌లో లాస్ట్‌లో ర‌ప్పా..ర‌ప్పాపై స్పందించిన తీరు అన్నీ మీడియా, సోష‌ల్ మీడియాల్లో హైలైట్ అయ్యాయి.

విలేక‌రుల స‌మావేశంలో జ‌గ‌న్ వేసిన ప్ర‌శ్న‌ల‌కు శాఖ ప‌ర‌మైన స‌మాధానాలు, వివ‌రణాత్మ‌క విశ్లేష‌ణ‌లు ఇవ్వ‌కుండా.. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), దాని అనుబంధ మీడియా ఛాన‌ళ్లు ర‌ప్పా.. ర‌ప్పా డైలాగ్‌ను హైలైట్ చేసి, అప్పులు, స్కీమ్స్‌, లెక్క‌ల‌ను ప‌క్క‌కు నెట్టేశాయ‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

ఆ త‌రువాత రెంట‌పాళ్ల ప‌ర్య‌ట‌న‌పై కొత్త వీడియోను విడుద‌ల చేయ‌డం, డ్రైవ‌ర్ సీటుకు అటుప‌క్కన నిల్చొని అభిమానుల అరుపులు, కేక‌ల న‌డుమ‌ 100 డెసిబ‌ల్స్ సౌండ్స్‌లో అభివాదం చేస్తూ ఆ హ‌డావిడిలో ఉన్న‌ జ‌గ‌నే సింగ‌య్య‌ను కారుతో తొక్కించాడ‌నేలా ప్ర‌చారం చేశారు. ఆ త‌రువాత అందంతా ఫేక్ అని, ఆ వీడియో ఒరిజిన‌లే అయితే జ‌గ‌న్‌పై బుర‌ద‌జ‌ల్లేందుకు పెద్ద ఆయుధం క‌దా..? తెలుగుదేశం పార్టీ, చంద్ర‌బాబు (Chandrababu), లోకేష్ (Lokesh) వారి ట్విట్ట‌ర్ ఖాతాల్లో ఎందుకు ఇంత వ‌ర‌కు పోస్టు చేయ‌లేదు.. వాస్త‌వం కాద‌ని తేలితే అడ్డంగా ఇరుక్కుంటామ‌ని, చాక‌చ‌క్యంగా త‌న అనుకూల మీడియాకు వ‌దిలిందా అనే అనుమానం కూడా అటువైపు ఉంది.

కాగా, ప్ర‌భుత్వ చ‌ర్య‌పై వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిప‌డుతున్నారు. వాహ‌నాన్ని అయితే తీసుకెళ్తారు కానీ, అందులోని బుల్లెట్‌ను కాద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల కోసం పోరాడే జ‌గ‌న్‌ను వాహ‌నాలు లాక్కెళ్లి, ఆంక్ష‌లు పెట్టి అడ్డుకోలేర‌ని వైసీపీ శ్రేణులు మండిప‌డుతున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, అందుకే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌కు ఆంక్ష‌లు, ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన‌ ప‌ర్య‌ట‌న‌పై తాజాగా కేసు బుక్ చేయ‌డం, సింగ‌య్య మృతికి మొద‌ట టాటా స‌ఫ‌రీ అని ఆ త‌రువాత మాజీ సీఎం సొంత వెహికల్‌ను తీసుకెళ్ల‌డం వంటి ఘ‌ట‌న‌లే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లుగా చెబుతున్నారు.

జడ్+ కేటగిరీ (Z+ – Security Category) భద్రత కలిగిన వైఎస్ జగన్‌కు ప్రభుత్వం స‌రిగ్గా ప‌నిచేయ‌ని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అందజేసింది. ఆ వాహనం వినుకొండ ప‌ర్య‌ట‌న‌లో మొరాయించ‌డంతో జగన్ తన సొంత ఖర్చుతో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేశారు. “ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం ఆ వాహనాన్ని మార్చలేదు. ఇప్పుడు సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో జగన్ సొంత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు,” అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం జగన్‌ను ప్రజల నుంచి దూరం చేయడానికి ఈ చర్యలకు పాల్పడుతోందని, ప్ర‌జాద‌ర‌ణ చూసి సంవ‌త్స‌రంలోనే ప్ర‌భుత్వంపై ఇంత వ్య‌తిరేక‌త పెరిగిందనే గూఢ‌ నిజాన్ని త‌ట్టుకోలేక ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోందంటోంది వైసీపీ క్యాడ‌ర్‌. జ‌గ‌న్‌కు రాజ‌కీయ‌ వేధింపులు కొత్త‌కాద‌ని, ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్ర‌నాయ‌క‌త్వాన్నే ఢీకొట్టిన చ‌రిత్ర ఉందంటూ గ‌తాన్ని గుర్తుచేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment